Viral News : ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుల మతాల వారు నివసిస్తూ ఉన్నప్పుడు వారి కుల మతాలకు అతీతంగా ఎన్నో రకాల ఆచారాలను మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటారు. ఇప్పటికీ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారవ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు.అయితే కొన్ని సార్లు వీరి ఆచార సాంప్రదాయాల గురించి వింటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది.ఇలా అందరికీ ఆశ్చర్యం కలిగించే సాంప్రదాయాన్ని ఇప్పటికీ ఇండోనేషియాలోని ఒక తెగవారు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. మరి వారి ఆచార సాంప్రదాయాలు ఏమిటో తెలుసుకుందాం..
సాధారణంగా పెళ్లి చేసే సమయంలో ప్రతి ఒక్కరు ఎన్నో ఆచారవ్యవహారాలను పాటిస్తారు. ఈక్రమంలోనే ఇండోనేషియాలోని టిడాంగ్ కమ్యూనిటీకి చెందిన వారు పెళ్లి అయిన తర్వాత కొత్త జంట మూడు రోజుల పాటు ఎలాంటి మరుగుదొడ్లు ఉపయోగించకుండా ఉండాలట. ఇదే వీరి ఆచారం.వీరి ఆచారం విన్న ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పెళ్లయిన కొత్త జంటను మూడు రోజుల పాటు ఒకే గదిలో ఉంచి వారు మూడు రోజుల పాటు టాయిలెట్ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఎవరైతే ఇలా మూడు రోజుల పాటు వాష్ రూమ్ ఉపయోగించకుండా ఉంటారో అలాంటి వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతుందని వారు పిల్లాపాపలతో ఎంతో సంతోషంగా ఉంటారని అక్కడి వారు విశ్వసిస్తారు. అలాకాకుండా ఎవరైతే ఈ నియమాన్ని పాటించరో అలాంటి వారి జీవితంలో ఎన్నో కష్టాలని ఎదుర్కోవలసి ఉంటుందని, చిన్నవయసులోనే చనిపోవడం లేదా పిల్లలు కలగకపోవడం,వైవాహిక జీవితంలో ఆటుపోట్లు కలగడం వంటి సమస్యలు తలెత్తుతాయని భావిస్తారు. అందుకే కొత్తగా పెళ్ళయిన జంట మూడు రోజులపాటు టాయిలెట్ ఉపయోగించకుండా బంధువులు ఈ జంటకు తక్కువ మొత్తంలో ఆహారం ఇతర పానీయాలను సమకూరుస్తారు. ఏది ఏమైనా ఈ ఆచారం విన్న నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Vishnu Priya : వామ్మో… అదేమీ ఊపుడు విష్ణు ప్రియ… టాపు పైకి లేపి మరీ రచ్చ?