Janaki Kalaganaledu june 1 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మల్లిక, జ్ఞానాంబ వేసుకునే టాబ్లెట్లను తారుమారు చేస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో మల్లిక తారుమారు చేసిన టాబ్లెట్లను జ్ఞానాంబ గమనించకుండా వేసుకుంటుంది. ప్లాన్ సక్సెస్ అయినందుకు మల్లికా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది. మరొకవైపు జానకి, రామచంద్రలు లగేజ్ తీసుకుని బయలుదేరుతారు. అప్పుడు జ్ఞానాంబ ఆశీర్వాదం తీసుకున్న తరువాత ఇక వెంటనే జ్ఞానాంబ కళ్లు తిరిగి పడిపోతుంది.

Janaki Kalaganaledu june 1 Today Episode
అప్పుడు ఇంట్లో వారు అందరూ భయపడి వెంటనే డాక్టర్ కి ఫోన్ చేస్తారు. మల్లిక తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో జానకి,జ్ఞానాంబ వేసుకున్న టాబ్లెట్లను గమనించి అత్తయ్య గారు పొరపాటున బీపి టాబ్లెట్ లు వేసుకున్నారు తగ్గించాలి అనుకొని కిచెన్ లోకి వెళ్లి ఏదో ప్రిపేర్ చేస్తూ ఉండగా ఇంతలో లూసీ ఫోన్ల మీద ఫోన్లు చేసి తొందరగా రండి అని కంగారు పడుతుంది.
ఆ తర్వాత జానకి డాక్టర్ వచ్చేవరకూ ఆయుర్వేదం గా ప్రథమ చికిత్స చేస్తూ ఉంటుంది. జ్ఞానాంబ పరిస్థితి మరింత విషమించడంతో మల్లిక భయపడుతుంది. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగేలా ఉంది అనుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి కరెక్ట్ గా ప్రథమ చికిత్స చేశారు అని జానకిని మెచ్చుకుంటుంది.
అప్పుడు మల్లిక డాక్టర్ గారు మా అత్తయ్య గారిని ఎలాగైనా కాపాడండి అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది. అప్పుడు విసుగొచ్చిన డాక్టర్ కొద్దిసేపు ఆగండి చూస్తున్నాను కదా అని మల్లిక పై విరుచుకు పడుతుంది. అప్పుడు డాక్టర్ చేసి బీపి కొంచెం డౌన్ అయింది కోలుకోవడానికి కొంత టైం పడుతుంది అని చెప్పడంతో జ్ఞానాంబ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటారు.
ఆ తర్వాత జానకి రామచంద్ర బయట నిలబడి ఉండగా ఇంతలో జానకికి లూసీ ఫోన్ చేసి ఎలా అయినా హైదరాబాద్ కి 9 గంటలకల్లా వచ్చేయాలి లేకపోతే కాంపిటీషన్ లో పాల్గొనడం కష్టం అని చెప్పగా, అప్పుడు జానకి ఆ పోటీ లకు అంటే మాకు మా అత్తయ్య ముఖ్యం అని అనగా అప్పుడు లూసి అదేంటి జానకి నువ్వు మీ హస్బెండ్ ఈ పోటీలో ఎలా అయినా పాల్గొనాలి అని కష్టపడ్డావు కదా అని అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో రామచంద్ర జ్ఞానాంబ ను క్షమించమని కోరుతూ అసలు విషయాన్ని చెప్పేస్తాడు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.