Ram Charan – Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అదే జోష్ తో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. తండ్రి కొడుకులు కలిసి నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇకపోతే ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. అంతేకాకుండా తాజాగా విడుదల అయిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.
తాజాగా ఏప్రిల్ 18 న ఈ సినిమా నుంచి భలే భలే బంజారా అనే పాటను విడుదల చేయబోతున్నారు చిత్రబృందం. ఈ పాటలో రామ్ చరణ్ తో పాటు, చిరంజీవి కూడా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో భలే భలే బంజారా పాటలో రామ్ చరణ్ నన్ను డామినేట్ చేస్తాడని భయంగా ఉంది. మొన్న తారక్‌తో కలిసి నాటు నాటు అంటూ ఇరగదీశాడు కూడా అని తెలిపాడు చిరు. అప్పుడు రామ్ చరణ్ మేము ఏం చేసినా మీరు ఒక గ్రేస్ మూమెంట్ చేస్తే చాలు అన్నాడు. ఇక, కొరటాల వెళ్లిపోయిన తర్వాత అప్పుడు చిరంజీవి ఏరా నన్ను డామినేట్ చేస్తావా అని చరణ్‌ను అడగ్గా అస్సలు తగ్గను అంటూ ఏకంగా తండ్రి చిరంజీవి ఛాలెంజ్ విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
Ginger Benefits : కీళ్లనొప్పులు, దగ్గు, జలుబు, కడుపునొప్పి, మోషన్ సిక్‌నెస్, వికారం, అజీర్ణం వంటి సందర్భాల్లో అల్లంను ఎక్కువగా…
Vasantha Panchami 2025 : వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు…
This website uses cookies.