Rakul Preet Singh : Rakul Preet Singh Shocking Comments on WorkOut for movies
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు చిత్రపరిశ్రమలో తెలియని వారుండరు. రకుల్ క్యూట్‌నెస్ అందరికీ నచ్చుతుంది. అందుకే చాలా మంది రకుల్‌కు అభిమానులు అయ్యారట.. ఈ భామ యాక్టర్ గానే కాదు.. ఫిట్‌నెస్ పరంగాను ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఖాళీ టైం దొరికితే చాలు రకుల్ వర్కౌట్స్ చేస్తూ వీడియోలను పోస్టు చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడికి సినిమాలు తగ్గాయని తెలుస్తోంది. అందుకే మళ్లీ బాలీవుడ్ వైపు చూస్తోందని టాక్ కూడా వినిపిస్తోంది.
అయితే, రకుల్ తన సినీ కెరీర్‌లో అలాంటి సినిమాలు చేయొద్దని నిర్ణయించుకున్నదట.. సాధారణంగా చాలెంజింగ్ రోల్స్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. అందుకు తాను కూడా సిద్ధమేనని.. కానీ క్యారెక్టర్ డిమాండ్ చేసిందని ఉన్నట్టుండి బరువు పెరగడం, తగ్గడం వంటి సినిమాలు చేసేందుకు తాను ఇష్టపడనని ఈ సెక్సీ బ్యూటీ కుండబద్దలు గొట్టేసింది.
ఏదైనా సహజంగా ఉండాలని పేర్కొంది. ఒక్కసారిగా బరువు పెరగడం, తగ్గడం వంటి రిస్కీ పనులు చేయడం వలన ఆరోగ్యం పాడవుతుందని, మన శరీరంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందన్నారు. అందుకే తాను అటువంటి సినిమాలు చేసేందుకు ఇష్టపడనని తెలిపింది. గాడ్ గ్రేస్ ఇంతవరకు తనకు అలాంటి సినిమాలు కూడా రాలేదని పేర్కొంది.
రకుల్ ప్రీత్ సింగ్ దశాబ్దకాలంలో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ వస్తోంది. కెరటం మూవీతో ఇండస్ట్రీలో అడగుపెట్టి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఈ భామ వెనక్కి తిరిగిచూసుకోలేదు. టాలీవుడ్ లోని అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, ఇటీవల రకుల్ నటించిన సినిమాలు ఫ్లావ్ అవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గినట్టు తెలుస్తోంది.కాగా, బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో రిలేషన్ లో ఉన్నట్టు రకుల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also : BJP Swetha Reddy : దేవి శ్రీ ప్రసాద్ చెత్త మ్యూజిక్ డైరెక్టర్.. శ్వేతారెడ్డి సంచలన కామెంట్స్..
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.