BJP Swetha Reddy : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. ఇటీవల విడుదలైన ఈ ఫిల్మ్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. మెగా అభిమానులు చిత్రం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిక్చర్‌లోని ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా’ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. కాగా, ఈ సాంగ్ పురుషులను కింఛపరిచే విధంగా ఉందని, దానిని నిషేధించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఈ సాంగ్ విషయమై మరో వివాదం చెలరేగింది.
‘పుష్ప’ మూవీ ప్రెస్ మీట్‌లో భాగంగా ఐటెమ్ సాంగ్ గురించి ఈ సినిమా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ వివరించాడు. ఈ క్రమంలోనే ఐటెం సాంగ్‌ను డివోషనల్ సాంగ్‌తో పోల్చాడు. అంతే ఇక అక్కడ వివాదం రాజుకుంది. హిందూ సంఘాలన్నీ దేవి శ్రీప్రసాద్ వ్యాఖ్యలను తప్పుబట్టాయి.ఆయన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా స్పందించారు. తాజాగా బీజేపీ మహిళా అధ్యక్షురాలు , యాంకర్ శ్వేతా రెడ్డి రియాక్ట్ అయింది. ఈ క్రమంలోనే దేవి శ్రీప్రసాద్‌ను పరుష పదజాలంతో దూషించింది.
దేవి శ్రీ ప్రసాద్ చెత్త మ్యూజిక్ డైరెక్టర్ అని విమర్శించింది. తల్లికి, చెల్లికి, దేవుడికి, ఐటమ్ సాంగ్‌కు దేవి శ్రీ ప్రసాద్‌కు తేడా తెలియదని ఆరోపించింది. దేవుళ్ల సాంగ్స్, ఐటెం సాంగ్స్ ఒకటేనంటూ దేవి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. దేవి శ్రీప్రసాద్ చెత్త వాగుడు వాగాడని, ఐటెం సాంగ్స్‌లోకి దేవుళ్లను లాగడమే కరక్టెనా అని ప్రశ్నించింది. దేవి శ్రీ ప్రసాద్ వెంటనే ఈ విషయమై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది యాంకర్ శ్వేతారెడ్డి. ఒకవేళ డీఎస్పీ క్షమాపణలు చెప్పకపోతే హిందూ సంఘాలు దేవి శ్రీ ప్రసాద్‌ను తరిమి కొడతాయని వార్నింగ్ ఇచ్చింది.
Read Also : Madhavi Latha : పుష్పలో ‘సమంత’ స్పెషల్ సాంగ్‌పై మాధవీలత సెన్సెషనల్ కామెంట్స్..
Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…
Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…
Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…
Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
This website uses cookies.