Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ ఉందని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇక ఈయన నటన పై ఎంతోమందితో ప్రశంసలు కూడా కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ ఇంటర్ పరీక్ష పత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర గురించి ప్రశ్నలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో త్రిబుల్ ఆర్ సినిమాలోని కొమరం భీమ్ పాత్ర గురించి ఒక వ్యాసం ఇచ్చి మీరు కొమరం భీమ్ ను ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి ఎలాంటి ప్రశ్నలు అడిగి.. సమాధానాలు రాబడతారు అంటూ ప్రశ్నించారు. ఇలా ఇంటర్ పరీక్ష పత్రంలో ఎన్టీఆర్ గురించి రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ తరుణంలోనే ఈ క్వశ్చన్ పేపర్ ను ఎన్టీఆర్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.
ట్విట్టర్ వేదికగా క్వశ్చన్ పేపర్ ఫోటోని వైరల్ చేస్తూ పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడి గురించి కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు దట్ ఇస్ ది పవర్ ఆఫ్ ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేయగా మరికొందరు తారక్ అన్నతో అట్లుంటది మరి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రశ్నాపత్రంలో ఇలా రాజమౌళి సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ ప్రశ్న రావడంతో ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి ఎంతో క్రేజ్ సంపాదించుకుందని చెప్పాలి.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.