Sitara: సితార ఘట్టమనేని మహేష్ బాబు నమ్రత గారాలపట్టిగా అందరికీ సుపరిచితమే. ఈమె అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సితార ఇప్పటికే ఒక ఇంగ్లీష్ సినిమాకు డబ్బింగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన డాన్స్ వీడియోలు చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. ఈ విధంగా ఇంత చిన్న వయసులోనే సితార ఒకవైపు తన చదువులు కొనసాగిస్తూ మరో వైపు సోషల్ మీడియా వేదికగా తన టాలెంట్ బయటపెడుతూ అభిమానులను పోగు చేసుకున్నారు.
తాజాగా సితార మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట సినిమాలో పెన్నీ పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ విధంగా సితార డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించి ఎడ్యుకేషన్ కి సంబంధించిన విషయాలను, సినిమా పాటలకు డాన్స్ వీడియో లు చేస్తూ విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఇకపోతే మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సితార తన డ్రీమ్ ఏంటో చెప్పుకొచ్చారు…
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా భవిష్యత్తులో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు… అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సితార సమాధానం చెబుతూ భవిష్యత్తులో తనకు డాక్టర్, ఇంజనీర్ అవ్వాలనే కలలు ఏమాత్రం లేవని, తను కచ్చితంగా పెద్ద యాక్టర్ అవుతానని అదే తన డ్రీమ్ అంటూ సితార తన భవిష్యత్తు గురించి ఎంతో క్లారిటీతో ఉన్నారు. ఇక ఈమె ఫ్యూచర్ గురించి మహేష్ బాబు కూడా పలు సందర్భాలలో మాట్లాడుతూ సితార పెద్ద హీరోయిన్ అవుతుంది అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి రాబోయే రోజులలో మనం మహేష్ కూతురుని స్టార్ హీరోయిన్ గా చూడబోతున్నామని తెలుస్తోంది.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.