Sukumar wanted them to be nude in that scene
Pushpa Sukumar : పుష్ప సినిమాపై డైరెక్టర్ సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్రంలో ఓ సన్నివేషాన్ని నగ్నంగా తీయాలని అనుకున్నాడట. మరీ, ఆ సన్నివేషం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు.
ఆయన తీసిన సినిమాలు చాలా థ్రిల్లింగ్‌గా, స్క్రీన్ ప్లే అనేక వేరియేషన్లతో సాగుతుంటాయి. వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. అయితే ఆయన ఇటీవల విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీస్తున్నారు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన రంగంస్థలంతో సూపర్ హిట్ కొట్టి చూపించాడు డైరెక్టర్ సుకుమార్.
ఈ సినిమాలో హీరో రాంచరణ్, హీరోయిన్ సమంతా నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గతంలో వీరు ఇలాంటి సినిమాలు చేసింది లేదు. మాములుగా అయితే చెవిటి వాడిగా నటించి ప్రేక్షకులను మెప్పించడం అంత ఈజీ కాదు. కానీ, హీరో రాంచరణ్ చెవిటి వాడి పాత్రలో ఒదిగిపోయాడు. ఇక సమంతా కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. తాజాగా పుష్ప సినిమా కూడా పల్లెటూరులో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తీసినదే. కూలీ పనికి పోయే ఓ పల్లెటూరి యువకుడు ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎలా మారాడు అన్నదే స్టోరీ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుష్ప చిత్రంపై ఆసక్తిర విషయాలు వెల్లడించారు డైరెక్టర్ సుకుమార్. సినిమా క్లైమాక్స్‌లో హీరో అల్లు అర్జున్, విలన్ ఫాహాద్ పాజిల్ మధ్య జరిగిన సీన్‌ను నగ్నంగా తీయాలని అనుకున్నాడట. అయితే తెలుగు ప్రేక్షకులు బోల్డ్ కంటెంట్‌ను చూడటానికి ఇబ్బందిపడతారని భావించి మనసు మార్చుకున్నానని సుకుమార్ చెప్పుకొచ్చారు.
నెగెటివ్ టాక్‌తో ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం రూ.250 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో డీ గ్ల్యామరస్ పాత్రలో నటించి మెప్పించాడు హీరో అల్లు అర్జున్. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా, సమంత స్పెషల్ సాంగ్‌లో అలరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పుష్ప సీక్వెల్ సెట్స్ మీదకు రానున్నట్లు సమాచారం.
Read Also : Rashmi Gautam : రష్మి గౌతమ్ కాళ్లు పట్టుకున్న రాకింగ్ రాకేశ్… ఎందుకోసమో చెప్పేసిన మనో..
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.