#Govt Jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs

,

PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ 22వ వాయిదా విడుదల తేదీపై లేటెస్ట్ అప్‌డేట్.. రైతుల ఖాతాల్లోకి రూ. 2,000 ఎప్పుడంటే?

By Ramesh Babu

Published on: February 21, 2026

Follow Us

PM Kisan 22nd Installment

---Advertisement---

  • లక్షలాది పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్
  • పీఎం కిసాన్ 22వ విడతపై తాజా సమాచారం, పూర్తి వివరాలు
  • ఫిబ్రవరి 24న విడుదల అయ్యే అవకాశం
  • హోలీకి ముందే 22వ విడత రైతుల ఖాతాలోకి?

PM Kisan 22nd Installment 2026 : పీఎం కిసాన్ రైతులకు అలర్ట్. ప్రధానమంత్రి కిసాన్ యోజన 22వ విడత కోసం కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. 22వ విడత అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. మీడియా నివేదికలను పరిశీలిస్తే.. ఫిబ్రవరి 24 లేదా హోలీకి ముందు వస్తాయని అంచనా.

పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో స్టేటస్ చెకింగ్ ఎలా? :
ప్రధానమంత్రి కిసాన్ యోజన 22వ విడత తేదీ ఎప్పుడు విడుదల కానుంది. పీఎం కిసాన్ యోజన కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఫిబ్రవరి కూడా ముగియబోతోంది. రైతుల అందరిలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది. ఈ నిరీక్షణ ఎప్పుడు ముగుస్తుంది? కేంద్ర ప్రభుత్వం 22వ విడత (PM Kisan Yojana 22nd Installment) తేదీని ప్రకటించలేదు. అతి త్వరలోనే కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది.

Read Also : PM Kisan Yojana : రైతులకు భారీ గుడ్ న్యూస్, పీఎం కిసాన్ 22వ విడత రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?

పీఎం కిసాన్ 22వ విడత ఎప్పుడు వస్తుంది? :
దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు పీఎం కిసాన్ రూ. 2వేలు ఎప్పుడు విడుదల అయ్యే తేదీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ప్రధానమంత్రి కిసాన్ యోజన 22వ విడత ఫిబ్రవరి 24న విడుదల అయ్యే అవకాశం ఉందని అనేక మీడియా వేదికలు పేర్కొంటున్నాయి. అయితే, ఇది అధికారిక తేదీ కాదని గమనించాలి.

22వ విడతకు సంబంధించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు. ఈ తేదీ కేవలం ఒక అంచనా మాత్రమే. 22వ విడత హోలీకి ముందు రైతుల ఖాతాలకు విడుదల చేయొచ్చునని చెబుతున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? : (PM Kisan 22nd Installment)

  • పీఎం కిసాన్ (pmkisan.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలోని ఫార్మర్స్ కార్నర్ లింక్‌కి వెళ్లండి.
  • నో యువర్ స్టేటస్ ట్యాబ్‌ను ఎంచుకోండి.
  • స్టేటస్ చెక్ చేసేందుకు రిజిస్ట్రేషన్ నంబర్, సేఫ్టీ కోడ్‌ ఎంటర్ చేయండి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • పోర్టల్‌లో OTP ఎంటర్ చేసి 22వ విడత స్టేటస్ చెక్ చేయండి.

పీఎం కిసాన్ దరఖాస్తుదారులు అర్హత పొందాలంటే పెండింగ్‌లో ఉన్న ఫార్మాలిటీలను పూర్తి చేయాలి. ఇందులో ఆధార్ కార్డ్ లింక్ చేయాలి. పాన్ కార్డ్ వెరిఫికేషన్ లేదా బ్యాంక్ అకౌంట్ సమస్యలను సరిదిద్దుకోవాలి. ఎందుకంటే పెండింగ్ స్టేటస్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి కాలేదని అర్థం.

, , ,