Guppedantha Manasu March 5 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.. వసుదార గౌతమ్ కి కాల్ చేసి రిషి కోపంగా ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడించండి సార్.. ఒంటరిగా వదిలేయండి అని జాగ్రత్తలు చెబుతుంది.
ఇక గౌతమ్, రిషి పై చూపిస్తున్న జాగ్రత్తను చూసి వసుధార ను మెచ్చుకుంటాడు. రిషి ఒంటరిగా కూర్చొని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మహేంద్ర వచ్చి రిషి ని మాట్లాడించడానికి ప్రయత్నించగా అప్పుడు రిషి కనీసం మహేంద్ర ముఖం చూడటానికి కూడా ఇష్టపడడు.
ఇక మహేంద్ర రిషి దగ్గరకు వచ్చి రిషి మనసును మార్చడానికి ప్రయత్నిస్తూ, జగతి విషయంలో తాను తప్పు చేయలేదని కరెక్టే చేశానని అంటారు. ఆ జర్నలిస్టు మీ అమ్మ గురించి తప్పుగా మాట్లాడారు అందుకే ఇలా చేశాను అని అంటాడు. కానీ రిషి మహేంద్ర మాటలు పట్టించుకోకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
మరొకవైపు జగతి అన్నం తినలేదని వసుధార కూడా అన్నం తినకుండా జగతి ని తినమని బతిమిలాడుతూ ఉంటుంది. జరిగిన దాని గురించి జగతి గుర్తు చేసుకుని మరింత కుమిలిపోతూ ఉంటుంది. ఇక వసుంధర మెసేజ్ చేసినా కూడా రిసీవ్ సరైన సమాధానం ఇవ్వడు.
దేవయాని గౌతమ్ ముందు జగతి గురించి చులకనగా మాట్లాడగా అప్పుడు మహేంద్ర చిన్న పని చెప్పి గౌతమ్ ని పక్కకు పంపించి జగతి విషయంలో తప్పుగా మాట్లాడితే బాగుండదు అంటూ వార్నింగ్ ఇస్తాడు. అంతేకాకుండా మీరు మనసులో ఏది జరగకూడదని అనుకుంటున్నారో అదే జరిగి తీరుతుంది చెబుతాడు మహేంద్ర.
మరొక వైపు వసుధార అందరికంటే ముందుగా వెళ్ళి కాలేజీలో రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రావడంతో ఆనందపడుతుంది. మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ చిన్న కథ చెబుతూ ఉండగా, కోపంతో రిషి, వసుధార ను తిడతాడు.
ఇంతలో గౌతమ్ వచ్చి ఈ రోజు మనం ఇద్దరం కలిసి భోజనం చేద్దాం వసుధారా అని అనగా, అప్పుడు రిషి, గౌతమ్ వైపు కోపంగా చూస్తూ ఈరోజు మనం ఇద్దరం కలిసి భోజనం చేద్దాం వసుధార అంటాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu : మహేంద్ర చేసిన పనికి బాధపడుతున్న రిషి.. ఒకరికొకరు ఎదురుపడ్డ జగతి, రిషి..?