Guppedantha Manasu March 16th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. వసు కాలేజీలో జరిగిన విషయానికి జగతి ఏం చేస్తుందో కంగారుపడుతూ ఇంటికి వస్తుంది. తలుపులు తెరిచి చూసి వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడ జగతి ఏమి జరగలేదు అన్నట్టుగా కూల్ గా కాఫీ తాగుతూ ఉంటుంది. అప్పుడు వసు మేడమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినందుకు మీకు బాధగా లేదా అని అడగగా నాకు ప్రాజెక్టు కంటే కొడుకు ముఖ్యం అని చెబుతోంది.
అలా వారిద్దరూ కాసేపు ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల గురించి, రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు గౌతమ్,అరేయ్ రిషి ఏమి అయింది రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అని అడగగా రిషి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇక అక్కడే ఉన్న ధరణి రిషి కో ఏమయింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఇక మరొకవైపు మహేంద్ర జగతి ఇంటికి వచ్చి నువ్వు టెన్షన్ పడుతున్నాను అనుకుంటే నువ్వు ఏంటి ఇలా కూల్ గా ఉన్నావు అని అడుగుతాడు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినందుకు జగతి సిటీ వదిలేసి వెళ్లి పోతుంది అని మహేంద్ర మనసులో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జగతి నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని తాను వేసిన ఒక ప్లాన్ ను మహేంద్ర, వసు కి చెబుతుంది. మహేంద్ర జగతి ప్లాన్ విని ఆశ్చర్యపోతాడు.
Guppedantha Manasu March 16th Today Episode :
మరొకవైపు రిషి,వసు పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ వారి మధ్య కొద్ది సేపు ఫన్నీగా యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలోనే వసుధార, రిషి కోసం కాఫీ, ఐస్ క్రీమ్ తీసుకొని వస్తుంది.అప్పుడు రిషి కి అర్థం కాక తన మాటలు తనకే చెబుతున్నావ అని అడుగుతాడు. అప్పుడు రిషి,వసు కోపం గా ఉంటుంది అనుకుంటే ఏంటి ఇంత సంతోషంగా ఉంది అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు.
నీ ఉత్సాహానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అనేది మెసేజ్ చేసి అడగగా, ఉత్సాహం మంచిదే కదా సార్ అంటూ రిప్లై ఇస్తుంది. మరొకవైపు మహేంద్ర,రిషి నీకు ఇష్టమైన నిర్ణయాలు నువ్వు తీసుకున్నప్పుడు నాకు నచ్చిన నిర్ణయాలు నేను తీసుకుంటాను అని చెప్పి కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవినుంచి తప్పుకుంటున్నట్లు రిషి తో చెబుతాడు. ఆ మాట విన్న రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu : కోపంతో రగిలిపోతున్న వసు.. మహేంద్ర పై విరుచుకుపడ్డ రిషి..?