Guppedantha Manasu March 25th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మినిస్టర్ ని జగతి మహేంద్ర కలుస్తారు. అప్పుడు మినిస్టర్ మాట్లాడుతూ మహేంద్ర గారు మీరు, ఈ కాలేజీ అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే నేను కూడా అదే కాలేజీలో చదివాను. కానీ సాక్షి ఎడ్యుకేషన్ మీ కాలేజీలో వేరు చేయాలని నాకు లేదు. కాబట్టి నాకు మెషిన్ ఎడ్యుకేషన్ లో జగతి మేడం ఆలోచనలు, అదేవిధంగా రిషి ఆచరణ రెండు కావాలి కాబట్టి మీరు రిషి ని ఒప్పించే ప్రయత్నంలో ఉండండి మహేంద్ర జగతి లకు చెబుతాడు మినిస్టర్.
ఇక అప్పుడు రిషి మహేంద్ర కి ఫోన్ చేసి డాడ్ మీతో మాట్లాడాలి అని అనడంతో మహేంద్ర, జగతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రిషి ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు రిషి మాట్లాడుతూ డాడ్ మీరు ఇంటికి రండి. నాకు ఇంటికి వెళ్తుంటే మీరే గుర్తొస్తున్నారు.. అక్కడ ఉండటం నావల్ల కావడం లేదు.. మనం ఎంత బాగా ఉండేవాళ్ళం అంటూ రిషి ఎమోషనల్ గా మాట్లాడటంతో మహేంద్ర ఏడుస్తూ ఎమోషనల్ అవుతాడు.
అప్పుడు మహేంద్ర మాట్లాడుతూ నువ్వు మనం అంటే నువ్వు నేను మాత్రమే అని అంటున్నావు, కానీ నేను జగతి తో పాటు మనం అవుతాం అంటున్నాను ఆ విషయం మీకు అర్థమైన కూడా అర్థం కానట్టు గా ఉన్నావు. నువ్వు తీసుకున్న ఒకే ఒక నిర్ణయం వల్ల మన కుటుంబ పరువు బజారున పడింది మినిస్టర్ దాకా వెళ్ళింది అని అంటారు మహేంద్ర.
మహేంద్ర మాటలకు కోపం వచ్చిన రిషి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక ఇంటికి వెళ్లగానే జగతి ఏం జరిగింది అని మహేంద్ర అని అడుగుతుంది. అప్పుడు మహేంద్ర జరిగినదంతా తలచుకొని సోఫాలో కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో జగతి వచ్చి ఏమయింది అని అడగగా మహేంద్ర ఏమీ మాట్లాడడు.
అప్పుడు జగతి ఇక్కడినుంచి నువ్వు వెళ్ళిపో మహేంద్ర అక్కడ రిషి ని ఎవరు చూసుకుంటారు అని అనడంతో అప్పుడు మహేంద్ర నేను ఒకరిని నియమించాను అని అంటాడు. ఇంతలో వసుధార అక్కడికి రావడంతో, వెళ్లి టిఫిన్ చెయ్ పో అని జగతి చెప్పడంతో అప్పుడు వసు వద్దు అంటుంది.
మళ్లీ జగతి కోపంతో తిను వసుధార అని అనడంతో వసు తినడానికి వెళ్తుండగా ఇద్దరు రిషి ఫోన్ చేయగానే అక్కడినుంచి పరుగు తీస్తుంది. అది చూసిన మహేంద్ర నేను నియమించిన ఆఫీసర్ వసు.. ఆన్ డ్యూటీ అంటూ గర్వంగా చెబుతాడు మహేంద్ర. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu: వసుధార ఫై మండిపడ్డ రిషి.. బాధలో జగతి..?