Madhavi Latha : పుష్పలో ‘సమంత’ స్పెషల్ సాంగ్‌పై మాధవీలత సెన్సెషనల్ కామెంట్స్..

Pushpa Samantha Song Madhavi Latha Shocking Comments on Pushpa Samantha Item Song
Pushpa Samantha Song Madhavi Latha Shocking Comments on Pushpa Samantha Item Song

Madhavi Latha : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17వ తేది శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. బన్నీ కెరీర్‌లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఇకపోతే పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటం సాంగ్‌కు థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి.

ఈ సాంగ్‌కు ఎంత రెస్పాన్స్‌ వస్తుందో అంతే రేంజ్‌లో వివాదాస్పదంగా కూడా మారింది. ‘ఊ ఉంటావా మామ.. ఊఊ అంటావా’ అంటూ సాగే ఈ సాంగ్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండగా.. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది.

Advertisement

మగవాళ్లు అందరూ బ్యాడ్ అనే మీనింగ్ వచ్చేలా ఈ పాట లిరిక్స్ ఉన్నాయని.. దీనిని వెంటనే తొలగించాలంటూ వారు డిమాండ్‌ చేశారు. అంతేగాకుండా ‘పుష్ప’ మూవీ మేకర్స్‌తో పాటు హీరోయిన్ సమంతపై కూడా కేసు పెట్టినట్టు తెలిసింది. కాగా, సామ్ స్టెప్పులేసిన స్పెషల్‌ సాంగ్‌పై పురుషుల సంఘం కేసు పెట్టిన విషయం తెలియడంతో నటి మాధవిలత తనదైన శైలితో దీనిపై స్పందించింది.

అంతటితో ఆగకుండా ఫేస్‌బుక్‌లో సెన్సెషనల్ కామెంట్స్ చేసింది. పురుషుల పరువే కాదు మహిళల పరువు కూడా పోయిందంటూ సెటైర్స్ వేసింది. ‘వాయమ్మో పుష్ప సినిమా పాట మీద కేసు పెట్టారంటగా.. ఇలా చూసుకుంటే ఇండస్ట్రీలో 98 శాతం పాటలు అలానే ఉంటాయి. అలాంటప్పుడు సాంగ్స్ లేని మూవీ చేయాలి.

Advertisement

నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకు కేసులు పెడతా.. పుష్పలో ఉన్న మరోసాంగ్ ‘రారా సామీ సాంగ్’ మీద కేసు పెడతా.. ఒక అమ్మాయికి మగాడిని చూస్తే, అతను పిలిస్తే అంత చులకనగా వెంటపడి వెళ్లిపోద్దా..? మహిళల పరువు పోయింది. ఛ నాకు నచ్చలే. నేను కూడా కేసు పెడతా. అంతే ‘తగ్గేదేలే’ అంటూ పోస్ట్ పెట్టింది. మాధవీలత పెట్టిన పోస్టుపై పలువురు తమకు నచ్చిన రీతితో స్పందిస్తున్నారు.

Read Also : Bigboss 5 Telugu : ‘సిరి’ ఔట్.. హగ్ ఇచ్చి కన్నీటి వీడ్కోలు పలికి ఎక్కెక్కి ఏడ్చేసిన షణ్ముక్.. !

Advertisement