...

Liger new update: లైగర్ నుంచి న్యూ అప్ డేట్… ఆకలితో ఉన్నానంటూ పోస్ట్!

Liger new update: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమై… పాన్ ఇండియా స్టార్ గా మారిన విజయ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమాకు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రపంచ లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటి నుంచే ప్రమోషన్లను మొదలు పెట్టింది.

ఈ క్రమంలోనే అభిమానులకు చిత్ర బృందం ఓ సర్ ప్రైజ్ ను ఇవ్వనందని.. విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. అందులో… నేను ఆకలితో ఉన్నా.. ఇండియా ఆఖలితో ఉందని.. ఇక ఇప్పుడు, అతన్ని చూపించే సమయం వచ్చింది. అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ సర్ ప్రైజ్ ను మే 9వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు చూపిస్తామని పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్లో హెచ్చరిక.. అతడు వేట మొదలు పెట్టడానికి సిద్ధమయ్యాడు అని ఉండటంతో టీజర్ అనౌన్స్ మెంట్ లేదా స్పెషల్ థీమ్ సాంగ్ రిలీజ్ ఉంటుందని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.