...

Anasuya: విశ్వక్ సేన్ వివాదంలోకి అనసూయను లాగిన కరాటే కళ్యాణి..?

Anasuya: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కరాటే కళ్యాణి ఇప్పటికే పలు విషయాల్లో సోషల్ మీడియాలో నిలిచిన విషయం తెలిసిందే. కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే పలు విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా హీరో విశ్వక్ సేన్ వివాదం గురించి స్పందించింది కరాటే కళ్యాణి. ఈ సందర్భంగా హీరోని సపోర్ట్ చేస్తూ సదరు యాంకర్ పై దుమ్మెత్తిపోసింది.

హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ప్రాంక్ వీడియో చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో అదే విషయం గురించి టీవీ9 డిబేట్ లో లైవ్ లో పాల్గొన్న విశ్వక్ సేన్ ను యాంకర్ దేవి నాగవల్లి గెట్ అవుట్ మై స్టూడియో అంటూ హీరోని అవమానించడంతో ఈ విషయం కాస్త పెద్ద వివాదంగా మారింది. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్ ఒక బూతు పదం వాడడం తో ఈ వివాదం మరింత ముదిరింది. ఇక ఈ వివాదం లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే చాలామంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు హీరో విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకొందరు మాత్రం హీరో విశ్వక్ సేన్ ని తప్పుబడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన కరాటే కళ్యాణి హీరో విశ్వక్ సేన్ కి మద్దతు తెలుపుతూ టీవీ9 ఛానల్ పై దుమ్మెత్తి పోసింది. కానీ అర్థం కాని విషయం ఏమిటంటే ఈ వివాదంలోకి యాంకర్ అనసూయని లాగింది కరాటే కళ్యాణి. ఈ విషయంపై స్పందించిన కరాటి కళ్యాణి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ ఈ వ్యవహారంలో కి యాంకర్ అనసూయ ని లాగింది. ఈ విషయంలో హీరో విశ్వక్ సేన్ తప్పు లేదు. నేను హీరో కి సపోర్ట్ చేస్తున్నాను. అంతెందుకు అనసూయ ఎన్నిసార్లు F*** అన్న భూత పదం వాడినప్పుడు నువ్వు రోడ్డుమీద డ్యాన్స్ చేసినప్పుడు ఏమైంది అమ్మా అంటూ మండి పడింది కరాటే కళ్యాని.