Job Mela : Apply for Kamareddy Job Interviews, Register online attend to Interview on April 3rd
Job Mela In Telangana : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.. కరోనా తర్వాత ఉద్యోగ నియామకాలు పెరిగాయి. కంపెనీలు కొత్త ఉద్యోగాలతో ముందుకు వస్తున్నాయి. తమ కంపెనీల్లో కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. తెలంగాణలో ఆదివారం ( ఏప్రిల్ 3)న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రభుత్వ సంస్థలు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. పలు ప్రైవేట సంస్థలు కూడా జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. కామారెడ్డిలోని పార్శి రాములు ఫంక్షన్ హాల్‌లో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ భారీ జాబ్ మేళాను.. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి్, టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు నిర్వహిస్తున్నారు. ఆదివారం రోజున ఈ జాబ్‌మేళాను కామారెడ్డిలో నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రైవేటు కంపెనీలు రానున్నాయి. భారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. ఇంతకీ జాబ్‌మేళాలో ఏయే కంపెనీలు రానున్నాయి? ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఉద్యోగ మేళాలో ఎస్‌బీఐ కార్డ్, మెడ్ ప్లస్, జయభేరి ఆటోమోటివ్, పీవీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అపోలో ఫార్మసీ, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొననున్నాయి. ఆసక్తి గల ఉద్యోగార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. (#MadanMohanJobMela) రిజిస్టర్ చేసుకున్న వాళ్లు ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి హాజరుకావాల్సి ఉంది.
ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. లింక్ ఓపెన్ కాగానే వాట్సాప్ నంబర్, మొబైల్ నంబర్, విద్యార్హతలు వంటి వివరాలను నమోదు చేసుకోవాలి. అలాగే మీ రెజ్యూమ్ సాఫ్ట్‌కాపీ కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా Submit క్లిక్ చేయాలి.
Read Also : Alia Bhatt : ‘ఆర్ఆర్‌ఆర్’ టీంపై అలియా భట్ ఫైర్.. రాజమౌళి అన్‌ఫాలో.. బాలీవుడ్ బ్యూటీ క్లారిటీ..!
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.