Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక హాస్పటల్లో రిషి తన తల్లి జగతిని మహేంద్ర విషయంలో తన మాటల తూటాలతో బాధపెడుతూ ఉంటాడు. మరోవైపు దేవయాని వాళ్లు హాస్పిటల్ లో ఉన్న మహేంద్రని చూడడానికి బయలుదేరుతారు.
అలా వారు కారులో వస్తుండగా దేవయాని ‘ఆ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు వల్లే మహేంద్ర ఒత్తిడికి గురి అయ్యాడని’ అంటుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలేజ్ భారాన్ని రిషి పై ఎక్కువ మోపారని దేవాయాని తన భర్తపై విరుచుకు పడుతుంది. ఇక మహేంద్ర గదిలోకి వచ్చిన జగతిను మహేంద్ర వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నావ్ కాస్త రెస్ట్ తీసుకో ఇంటికి వెళ్లి అని చెబుతాడు.
దానికి జగతి.. ‘మహేంద్ర ఇలాంటి పరిస్థితిలో నేను ఉంటే నన్ను వదిలి వెళ్ళగలవా చెప్పు’ అని అడుగుతుంది. దానికి మహేంద్ర బాగా ఎమోషనల్ అవుతాడు. దానికి మహేంద్ర నువ్వు బాగా అలసిపోతున్నావు అని అంటాడు. దానికి బదులుగా జగతి ‘ జీవితంలో నువ్వే అలసి పోతున్నావు మహేంద్ర’ అని అంటుంది. అక్కడ వారిరువురి ఎమోషనల్ బాండింగ్ చాలా బాగుంటుంది.
ఇంతలోపు దేవయాని తన ఫ్యామిలీతో కలిసి మహేంద్ర దగ్గరకు వస్తూ.. మహేంద్ర అని ఎమోషనల్ గా గట్టిగా అరుచుకుంటూ వస్తుంది. దానికి రిషి, జగతిలు ఆశ్చర్యపోతారు. మహేంద్ర ఏమిటీ ఘోరం.. అంటూ దేవయాని ఏడుపు సాగిస్తుంది. ‘నీ కష్టాలు పోయాయి అనుకున్నాను ఇంకా పోలేదు అనమాట’ అని డబల్ మీనింగ్ మాటలతో జగతికి అర్థమయ్యేలా మాట్లాడుతుంది.
అదే పనిగా దేవయాని అయ్యో.. మహేంద్ర అంటూ ఏడుపు కొనసాగిస్తూనే ఉంటుంది. కానీ.. నిజంగా ఏడుస్తుందో కావాలని ఏడుస్తుందో ఎవరికీ అర్థం కాదు. దానికి రిషి మీరు ఏడిస్తే నేను చూడలేను పెద్దమ్మ అని అంటాడు. ఆ మాట విన్న జగతి మనసులో బాధను వ్యక్తం చేసుకుని అక్కడినుంచి బయటకు వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత దేవయాని ఇంటికి మహేంద్ర ను తీసుకొని వెళ్తారు. ఇక దేవయాని మొదటిగా కారు దిగిన జగతిని చూసి ‘జగతి ఇక్కడికి వచ్చింది ఏమిటి’ అని ఆలోచిస్తుంది. ఈ లోపు మహేంద్రను కారు నుంచి దింపుతారు. మహేంద్ర ను ఎత్తుకోవడానికి సహాయం చేస్తున్న జగతిని.. రిషి, ‘మా డాడి ని నేను చూసుకోగలను’ అని విరుచుకుపడతాడు.
Read Also : Guppedantha Manasu : దిక్కుమాలిన అంటూ జగతిని దారుణంగా బాధ పెట్టిన దేవయాని!
Tufan9 Telugu News And Updates Breaking News All over World