Indian Celebrities Health : మూవీ ఇండస్ట్రీలో చాలా మంది స్మార్ట్‌గా, ఫేర్‌గా, యంగ్‌గా కనిపిస్తుంటారు. మనను ఎంటర్‌టైన్ చేసేందుకు మేకప్ వేసుకుని మూవీస్‌లో నటిస్తున్నారు. కానీ రియల్ లైఫ్‌లో చాలా మంది సెలబ్రిటీస్ డెంజరస్ వ్యాధులతో బాధపడుతున్నారు. వారి కష్టాలు ఎవరికీ తెలియవు. ఇందులో ఎంతో మంది ఫ్యాన్స్‌ను కలిగిన సెలబ్రిటీస్ ఉండటం బాధకలిగించే విషయం.
ఇండియన్ సినీ ఇండస్ట్రీకి అమితాబ్ బచ్చన్‌ను పేరును స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే షాకవ్వాల్సిందే. ఈయనకు 1984లో మ్యాస్తేవియా గ్రావిస్ అనే డిసీజ్ సోకింది. ఇది మెంటల్‌గా, ఫిజికల్‌గా బాడీని అనేక ఇబ్బందులకు గురిచేసే డిసీజ్. ఎన్నో మెడిసిన్స్ సహాయంతో ఆయన దాని నుంచి కోలుకున్నారు. అంతకు రెండేండ్ల ముందు కూలీ మూవీ షూటింగ్ టైంలో ప్రమాదానికి గురయ్యారు. తర్వాత లివర్ సిర్రోసిస్ అనే వ్యాధితోనూ బాధపడ్డారు. 2000 సంవత్సరంలో క్షయ బారిన పడ్డారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్‌లో ఒకరు దీపికాపదుకొనే. ఆమె చాలా మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. వీటి నుంచి బయటపడలేకపోతోంది. ఆరేళ్ల క్రితం లవ్ ఫెయిల్యూర్, వర్క్ స్ట్రేస్‌తో మానసిక కుంగుబాటుకు గురైంది. దాని నుంచి బయట పడేందుకు ఇంకా కౌన్సెలింగ్ తీసుకుంటూనే ఉంది. ఇక మనీషా కొయిరాల విషయనికి వస్తే.. ఈ భామకు 2012లో అండాశయ క్యాన్సర్ వ్యాధి సోకింది.
దీంతో న్యూయార్క్‌లో చాలా రోజులు ట్రీట్‌మెంట్ తీసుకుంది. ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం ట్రిగెమినల్ న్యూరాల్జియాతో బాధపడుతున్నాడు. ఇక పాలీ మార్ఫాస్ లైట్ ఎరప్షన్ వ్యాధితో సమంత , స్కిన్ డిసీజ్ తో నయనతార తదితర జబ్బులతో చాలా మంది బాధపడుతున్నారు. కానీ వీరిలో చాలా మంది తమ వ్యాధిని తమ ఫ్యాన్‌కు చెప్పలేదు.
Read Also : RRR Glimpse: టాలీవుడ్ స్థాయేంటో మరోసారి ప్రపంచానికి చాటే సినిమా