శని కాకుండా మీకు సమస్యలు, ఇబ్బందులు కల్గించడంలో ముందుండే గ్రహాలు రాహు, కేతువులు. అయితే రాహువు ఒక రహస్య గ్రం, రాహువు దృష్టిలో ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనది. ఏప్రిల్ లో రాహువు మారుతున్నాడు. అయితే ఈ ప్రభావం అన్ని రాశులపై పడబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాహు, దోషాన్ని వదిలించుకోవడానికి రాహువు ఈ ప్రత్యేక మంత్రాన్ని జపించాలి. ఈ ప్రత్యేకమైన నివారణలను అనుసరిస్తే వెంటనే ప్రభావాలను చూపిస్తుంది. అయింతే పంచాంగం ప్రకారం 2022 ఏప్రిల్ 12న రాహువు వృషభ రాశిలో తన ప్రయాణాన్ని ముగించుకొని మేష రాశిలోకి రాబోతున్నాడు. రాహువు 18 సంవత్సరాల తర్వాత మేష రాశిలోకి వస్తున్నాడు. రాహువు దాదాపు ఏడాదిన్నరపాటు మేషరాశిలో ఉంటాడు.
అయితే రాహు పరివర్తన వల్ల ఉద్యోగంలో ఆటంకాలు, ఆరోగ్యం, నష్టం, శత్రు బాధలు, ఆకస్మికంగా డబ్బులు లేకుండా పోవడం, ఖర్చులు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. సాధారణ పనుల్లో కూడా విజయం కోసం కష్ట పడాలి. డిపాజిట్లు త్వరగా తగ్గిపోతాయి. ఇం్లో పెద్దల పట్ల గౌరవం తగ్గుతుంది. డ్రగ్స్ కు అలవాటు పడి అక్రమాలకు పాల్పడడం వంటివి కూడా జరిగే అకాశాలు ఉన్నాయి. అయితే వీటిని పోగొట్టుకొని హాయిగా జీవించాలి అనుకుంటే… రాహువుతో బాధపడే వారు శని వారాల్లో తీపి పదార్థాలు తినకూడదు. గురువారం శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల రాహువు దోషాలు తొలగిపోతాయి. అలాగే మృత్యుంజయ హోమం మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల రాహువు కూడా శాంతిస్తాడు. రాహువును శాంత పరచడంలో ఈ మంత్రం చాలా ప్రభావ వంతంగా పని చేస్తుందని అంటారు.