తన తండ్రి శ్యామ్ సిద్దార్ఖ్ మరణ వార్తను అభిమానులు అందరికీ తెలియజేస్తూ.. యువ హీరో నిఖిల్ ఏ లేఖ రాశారు. ఎన్నో వేల మంది విద్యార్థులకు చదువును అందించిన తన తండ్రి.. ఆయన చుట్టూ ఉన్న వాళ్లందరినీ సంతోషంగా ఉంచేందుకే ప్రయత్నం చేశారని చెప్పాడు. ఎన్టీఆర్, ఏయన్నార్ లకు వీరాభిమాని అయిన తన తండ్రి.. తనను కూడా హీరోగా వెండి తెరపై చూడాలని ఎన్నో కలలు కన్నాడు. ఆయన అందించిన స్ఫూర్తి, సపోర్ట్ వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్లు వివరించాడు.
తమకు మంచి జీవితం అందించడం కోతం తన తండ్రి ఎంతగానో కష్టపడి పనిచేశారని గుర్తు చేసుకున్నారు. అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో జేఎన్టీయూ నుంచి స్టేట్ టాపర్ గా నిలిచిన ఆయన కేవలం హార్డ్ వర్క్ ని మాత్రమే నమ్మకున్నారు. జీవితంలో ఎంతో కష్టపడి దాని ఫలాలు అందుకునే సమయంలోనే అరుదైన వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందన్నారు. అలాగే మనం మళ్లీ కలుస్తామని అనుకుంటున్నా అంటూ రాసుకొచ్చారు.