Hanuman Jayannthi : ప్రతి ఏటా చైత్ర పూర్ణిమ రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 16 శనివారం రోజున వస్తోంది. ఆంజనేయుడు పవన సుతుడు. వాయు వాహనుడు. ఎంతో మందికి ప్రీతి పాత్రమైన హనుమాన్ కు ఆయన జయంతి రోజున ప్రత్యేక పూజలు చేసి కొలుస్తారు. చాలా మంది ఆ రోజున ఉపవాసం ఉంటారు. హనుమాన్ జయంతి రోజున ఆయనను పూజించడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుందని అంటారు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని చెబుతారు.
హనుమాన్ జయంతి రోజున ఏ రాశి వారు ఎలాంటి ప్రసాదం సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ జయంతికి ఉపవాసం చేయాలనుకునే వారు.. ముందు రోజు రాత్రి నేలపై నిద్రించాల్సి ఉంటుంది. రాముడు, సీతాదేవి, ఆంజనేయ స్వాములను ప్రార్థించాలి. పర్వదినం రోజున తెల్లవారు జామునే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. చేతిలో నీరు తీసుకుని ఉపవాస ప్రమాణం చేయాలి. అనంతరం పూజా గదిలో ఆంజనేయస్వామి పటం దగ్గర పూజ ఏర్పాటు చేసుకోవాలి. పూజ కోసం, తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టండి. హనుమాన్ చాలీసా నిష్టతో చదవాలి. షోడశోపచార( 16 ఆచారాలు)లను అనుసరించి హనుమంతుడిని ఆరాధించాలి.
Read Also : Devotional Tips : శని ప్రభావం మన ఇంటిపై ఉండకూడదు అంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్క ఉండాల్సిందే!
ఏ రాశి వారు ఏ విధమైన ప్రసాదం సమర్పించాలంటే..
మేషరాశి: ఈ రాశి వారు హనుమాన్ జయంతి నాడు తులసి విత్తనాలను సమర్పించాలి.
వృషభం: ఈ రాశి వారు హనుమంతుని పూజించే సమయంలో తులసి ఆకులను సమర్పించాలి.
కర్కాటక రాశి: వీరు ఆవు నెయ్యితో చేసిన శనగపిండిని నైవేద్యంగా అర్పించాలి
సింహరాశి: ఈ రాశి వారు హనుమంతునికి జిలేబీని సమర్పించాలి.
కన్య రాశి: వీరు దేవునికి వెండి రేకుతో ఉన్న స్వీట్లను అర్పించాలి.
తుల రాశి, మకరరాశి: ఈ రాశుల వారు మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఆవు నెయ్యితే శనగపిండి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు లడ్డూ, తులసి ఆకులను నైవేద్యంగా పెట్టాలి.
కుంభ రాశి: ఈ రాశి వారు ఎర్రటి వస్త్రం, లడ్డూలను పెట్టాలి.
మీనరాశి వారు లవంగాలు సమర్పించాలి.
Read Also : Lord Shani: శనిదేవుడి అనుగ్రహం కలిగి శని దోషం తొలగిపోవాలంటే ఇలా పూజ చేయాలి…!