Guppedantha Manasu june 14 Today Episode : స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియలల్ లలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతున్న గుప్పెడంత మనసు సీరియల్ కు రోజురోజుకు విశేష ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. మరి నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటి అనే విషయానికి వస్తే… వసుధారా మార్కెట్ కు వెళ్లి తిరిగి వస్తుండగా మధ్యలో సాక్షి అడ్డుపడుతుంది. ఈ విధంగా వసుకి అడ్డుపడిన సాక్షి ఎంతో గర్వంగా వసుని నానా మాటలు అంటుంది.నువ్వు నేను చెప్పిన విధంగానే విన్నావు అయితే నా కోసం ఇంకో పని చేసి పెట్టు అని సాక్షి అడుగుతుంది.

Guppedantha Manasu
సాక్షి అలా అడిగే సరికి ఏం చేయాలి అని వసుధార అడగగా నువ్వు కొద్ది రోజులు రిషికి దూరంగా వెళ్లిపోవాలి. రిషికి దూరంగా ఉంటే తన మనసులో ఆలోచనలు ఉండవు నేను శాశ్వతంగా మర్చిపోతాడు అంటూ చెబుతుంది. దీనికి పరిహారంగా నీకు డబ్బు కూడా ఇస్తానని తనకు చెక్ ఇస్తుంది.ఇక నువ్వు ఈ డబ్బు తీసుకొని వెళితే రిషి బాధ్యతలన్నీ నేను తీసుకుంటానని సాక్షి మాట్లాడగా ఆ మాటలు విన్న వసు చాలా కోపంగా సాక్షి పై వెటకారంగా మాటలు మాట్లాడటమే కాకుండా తనకు బాగా క్లాస్ పీకి అక్కడి నుంచి వెళ్తుంది.
ఇక వసు అక్కడి నుంచి వెళుతూ సాక్షి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటుంది.ఈ విషయాలన్నీ జగతి మేడమ్ కి చెబితే ఎలా ఉంటుంది అని ఆలోచించగా ఇవన్నీ మేడం కి చెప్పి మరో సారి తనని ఎందుకు టెన్షన్ పెట్టాలి, చెప్పకపోవడమే మంచిది అని వసుధార కాలేజీ కి వెళ్తుంది. అయితే అప్పటికే కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్ లో కొన్ని కెమికల్స్ కారణంగా పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి ఉంటాయి. దీంతో అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక లోపల ఉన్న విద్యార్థులందరినీ రిషి సురక్షితంగా బయటకు తీసుకు వస్తూ ఉంటారు.
బయట ఉన్నటువంటి జగతి మహేంద్ర రిషి కోసం ఆందోళన పడుతూ గట్టిగా రిషి అంటూ కేకలు వేస్తారు. ఇక అప్పటికే వసుధార కాలేజీకి రావడంతో పుష్ప జరిగినది మొత్తం చెబుతుంది.ఇక వెంటనే అసలు రిషి సార్ ని లోపలికి ఎందుకు పంపించారు అంటూ వసుధారా గట్టిగా కేకలు వేస్తూ రిషి సర్ ను కాపాడటం కోసం చున్ని మొహానికి అడ్డుపెట్టుకొని ల్యాబ్ లోపలికి వెళుతుంది. రిషి సార్ అంటు గట్టిగా కేకలు వేయగా రిషి అప్పటికే స్పృహ కోల్పోతూ ఉంటాడు.
ఇక రిషిని చూసిన వసుధార తనని లేపగానువ్వెందుకు వచ్చావు బయటకు వెళ్ళు ఇక్కడే ఉంటే ప్రాణాలకు ప్రమాదం అంటూ రిషి తనని బయటకు వెళ్ళమని చెబుతాడు. ఇక మీ ప్రాణాలకు ప్రమాదం అని వసుధార అనగా మరేం పర్లేదు వెళ్ళు అంటూ రిషి చెబుతాడు. మీకు ఏమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండను అని తన మనసులో ఉన్న మాటను బయట పెట్టగా ఒక్క సారిగా రిషి ఆ మాటలు విని షాక్ అవుతాడు. మీరు లేకుండా ఈ ప్రాణం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ వసు తన మనసులో ఉన్న మాటను బయట పెడుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి కాగా తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.
Read Also : Devatha june 14 today episode : రుక్మిణి కోసం దీక్ష మొదలుపెట్టిన దేవుడమ్మ.. షాక్ లో మాధవ..?