Green KumKum Laxmi : డబ్బు.. ఇదంటే ఇష్టం లేని వారు ఈ భూమ్మిద ఎవరూ ఉండరు. ఎందుకంటే మనిషి ఉన్న సమస్యల్లో ఇదే పెద్దది. దీనితో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అయితే ప్రపంచాన్ని శాసించే డబ్బుకు అధిపడి కుబేరుడు. అందుకే ఆయన గోవిందునికి సైతం అప్పు ఇచ్చారు. దీన్ని బట్టి కుబేరుడు ఎంత ధనవంతుడో అర్థం అవుతుంది. ఇండియన్ కల్చర్‌లో పసుపు, కుంకుమలు సౌభాగ్యానిని గుర్తులు. అందుకే పసుపు, కుంకుమను దేవతా స్వరూపంగా భావిస్తుంటారు.
అయితే ఈ కుంకుమలో అనేక రాకాలున్నాయి. సింధూరం, ఎర్రకుంకుమ, మీనాక్షి కుంకుమ అంటూ చాలానే రకాలున్నాయి. అయితే వీటిల్లో ఆకుపచ్చ కుంకుమ గురించి ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? దీనినే కుబేరపక్చ కుంకుమ అని కూడా అంటారు. దీనికి ఒక స్పెషాలిటీ ఉందంట. ఇది కుబేరునికి చాలా ఇష్టమట, దీనికి తోడు పార్వతీదేవికి సైతం ఇది ఇష్టమైన రంగు అంట. దీనిని పెట్టుకుంటే అదృష్టం వరిస్తుందని భావిస్తుంటారు కొందరు.
అయితే పురాణాల ప్రకారం పరమశివుడైన భక్తుడైన కుబేరుడు.. ఓ సారి కైలాసానికి వెళ్లాడంట. ఆ టైంలో పార్వతీపరమేశ్వరులు ఏకాంతంగా ఉండటాన్ని చూశాడట. తర్వాత పార్వతీ దేవిని తన భార్యగా ఊహించుకోడంతో శివుడికి కోపం వచ్చిందట. దీంతో పార్వతీపరమేశ్వరులు ఇద్దరూ ఉగ్రంగా కుబేరుడిని చూశారట. దీంతో అతడు కాలిపోయిందట. దీంతో కుబేరుడు వణికిపోతు.. క్షమించమని శివుడిని కోరాడట.
తమ ఇద్దరి కోపానికి కమిలిపోయిన శరీరం.. తాము ఇరువురి శాంత స్వరుపాలు ఒక్కటిగా అయినప్పుడు చల్లదనం వస్తుందని చెప్పాడట శివుడు. శివుడి గొంగు చుట్టున్న నీలి వర్ణం, పార్వతీదేవిది పసిమి ఛాయ. ఈ రెండు కలిసిన టైంలో ఒక అద్భుతము జరిగిందని పురుణాలు చెబుతున్నాయి. ఆ రెండింటి కిరణాలు పడ్డ ప్రదేశంలో ఉన్న మట్టి అంతా ఆకుపచ్చ రంగులోకి మారిందట. దానిని ఆ కుబేరుడు ఆయన శరీరానికి పూసుకున్న వెంటనే అతని శరీరం మామూలు స్థితికి వచ్చిందట. అలా ఆయన వారి ఆగ్రహం నుంచి విముక్తి పొందారట. ఆ ఆకుపచ్చ మట్టిని ఆయన ఎప్పుడూ తన దేహానికి ధరించేవాడట.
Read Also : Temple Pradakshinas : గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? అలా చేయకపోతే ఏమౌతుంది?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world