...

Horoscope Today : ఈ రాశి వారికి గుడ్ న్యూస్.. త్వరలోనే పెళ్లిపీటలెక్కుతారట..!

Horoscope Today : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.గర్ల్ ఫ్రెండ్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. ముందుగా మేష రాశి ము ఖ్యమైన పనులన్నీ శ్రమ లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కి అవకాశం ఉంది. వ్యాపారులు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.ప్రేమ సఫలం అవుతుంది ఆర్థిక లావాదేవీలు జరపవద్దు. వృషభ రాశి ఆదాయం ఆరోగ్యం పర్వాలేదు ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు,బంధువుల రాకపోకలు ఉంటాయి.వ్యాపారులకు అన్నివిధాలా బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త,కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. మిధునం..ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి.

ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. కర్కాటక రాశి వారికి ఆదాయంతోపాటు ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్య బాధ తప్పదు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. సింహ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుమారుడికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం వస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కన్య రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది.

విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. తులా రాశి వారికి దగ్గరి బంధువులు ఆదుకుంటారు. లాయర్లకు,సామాజిక కార్యకర్తలకు అనుకూలంగా ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. సోదరులతో ఆస్తి తగాదాలు తలెత్తే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదిరింది. ప్రేమ వ్యవహారాలు ఏమంత అనుకూలంగా ఉండకపోవచ్చు.

ధనస్సు రాశి వారికి ఉద్యోగం లో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి,స్వయం ఉపాధి వారికి అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మకర రాశి వారికి ఉద్యోగం లో బాధ్యతలు పెరుగుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. రుణ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళ్లావు.

వ్యాపారులు శ్రమ పడక తప్పదు. కుంభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. కొంత వరకు అప్పులు తీరుస్తారు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి.శుభకార్యాలకు అవకాశం ఉంది . ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తి చేయడంలో సహోద్యోగులు సహకరిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. ఇక చివరిగా మీనరాశి. ఈ రాశివారికి ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది.ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయం పెరుగుతుంది. అప్పుల వాళ్ళ ఒత్తిడి తగ్గించుకుంటారు. ఉద్యోగులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో ముందడుగు వేస్తారు.

Read Also :  Today Horoscope : ఈ రోజు రాశి ఫలాల్లో.. వీళ్లు గొడవలకు దూరంగా ఉండాలి లేదంటే..అంతే సంగతులు..