Gold Prices Today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold Prices Today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. మూడ్రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తుండగా.. ఈ రోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తురం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.54770 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి రూ.71,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Prices Today
Gold Prices Today

హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,770 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,770 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,100గా ఉంది. వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,770 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.54,770 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,973 డాలర్లు పలుకుతోంది. వెండి ధర కూడా యథాయథంగా ఉంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.70 డాలర్లుగా ఉంది.

Read Also : Cute Lady Dance : దొరక్క.. దొరక్క దొరికింది.. తళుక్కు చిలక ఇది.. అదిరే స్టెప్పులతో ఇరగదీసిన అమ్మాయి.. చూపు తిప్పుకోలేరంతే..!