...

Junior ntr: ఎన్టీఆర్ కు డైరెక్టర్ అట్లీ స్పెషల్ ట్రీట్.. చెన్నై నుంచి బిర్యానీ!

Junior ntr: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. డ్యాన్స్ తో పాటు అభినయాల్ని అలవోకగా పలికించగల టాలెంట్ ఆయన సొంతం. అయితే ఈయన భోజన ప్రియుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. దీని వల్లే ఒకప్పుడు ఆయన చాలా లావెక్కారని కూడా చెప్తుంటారు. అయితే ఇప్పటికీ ఆయనకు భోజనంపై ఉన్న ప్రేమ తగ్గలేదట. కాకపోతే అప్పటికీ, ఇప్పటకీ ఓ తేడా ఉందట. సినిమా కోసం ఎంత కష్టమైనా పడటంలో అప్పుడూ ఇప్పుడూ ఒకటే యినా, భోజనం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటానని చెబుతున్నాడు.

అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు చెన్నై బిర్యానీ అంటే ఎంత ఇష్టమో.. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు సునీల్ తెలిపారు. తలపాకట్టి బిర్యానీ పేరుతో చెనన్నైలో ఓ బిర్యానీ చాలా ఫేసమన్ అని… అదంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టమని వివరించాడు. అయితే విషయం తెలుసుకున్న డైరెక్టర్ అట్లీ.. జూనియర్ ఎన్టీఆర్ కు ఓ కథ చెప్పేందుకు వస్తుండగా.. వెంట బిర్యానీ తీసుకొచ్చారట. అది కూడా యంగ్ టైగర్ కు ఎంతో ఇష్టమైన తలపాకట్టి బిర్యానీ. ఈ విషయాన్ని కూడా సునీల్ యో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.