Karthika Deepam: పిల్లల జోలికి వచ్చిన రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ పని చేసే హోటల్ కు వచ్చిన మోనిత ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేస్తుంది. ఇక కార్తీక్ వైపుగా ఉన్న వాష్ బేసిన్ దగ్గరకు వెళుతుండగా కార్తీక్ తన దగ్గరికి వస్తుందేమో అని తెగ కంగారు పడతాడు. కానీ చేతులు వాష్ చేసుకోడానికి అక్కడికి వెళుతుంది.

ఆ హోటల్ లో అప్పు అనే వేరొక పనివాడు. మోనిత తో ఫన్నీ చిట్ చాట్ చేసుకుంటూ ఉంటాడు. మోనిత తనకు ఇంకా బిర్యానీ రాకపోవడంతో వెంటనే ఆ అప్పు మీద విరుచుకు పడుతుంది. దాంతో అప్పు వెళ్లి కార్తీక్ కు బదులుగా తాను ఎగ్ బిర్యానీ తీసుకుని వస్తాడు. దాంతో కార్తీక్ కు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నంత పని అవుతుంది. ఆ తర్వాత టైలర్ దీప దగ్గరికి వచ్చి మీ పిల్లలు జాగ్రత్త అని చెబుతుంది.

దాంతో దీప ఎందుకు? అని అడగటంతో రుద్రాణి మీ పిల్లల పై కన్నేసిందని.. వచ్చేనెల రుద్రాణి పుట్టినరోజు సందర్భంగా రెండు గౌనులు కొలతలు ఇచ్చిందని.. చెబుతుంది ఆవిడ. ఇక ఆ గౌను కొలతలు కచ్చితంగా మీ పిల్లలివే అని అంటుంది. దాంతో ఒక్కసారిగా దీపకి గుండె పగిలినంత పని అవుతుంది. ఆ హోటల్లో తినడం పూర్తయిన మోనిత బిల్ పే చేసి అప్పు కు టిప్పు ఇస్తుంది.

Advertisement

మోనిత వెళుతుండగా అప్పు ఒక సెల్ఫీ అడుగుతాడు. నవ్వుతూ సెల్ఫీ దిగి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. దాంతో కార్తీక్ ఊపిరి పీల్చుకుంటాడు. మరోవైపు సౌందర్య, ఆనందరావు లు ప్రకృతి వైద్యశాల లో ప్రశాంతంగా కూర్చుని కార్తీక్ ఈ ఊళ్ళో అయినా కనిపిస్తాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ట్విస్ట్ ఏంటి అంటే.. ఏకంగా దీప రుద్రాణి ఇంటికి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది.

ఆ సమయంలో రుద్రాణి ఇంట్లో ఉండదు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన రుద్రాణి ఇంట్లో వంట చేసే దీపను చూసి షాక్ అవుతుంది. రుద్రాణి ఇక్కడ ఏం పని అని అడగటం తో మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. అందుకే వచ్చానని వెటకారంగా సమాధానం చెబుతుంది. ఆ సమాధానానికి రుద్రాణి మండిపడుతుంది. దానికి దీప నీ ఇంట్లో వంట వండితేనే ఇంత కోపం వచ్చినప్పుడు నా పిల్లల పై కన్నేసిన నీ పై.. నాకు ఇంకెంత ఉండాలి అని హీరో లెవెల్ లో అంటుంది దీప.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel