HomeEntertainmentUn Stopable: కొత్త అతిథులతో త్వరలోనే రానున్న బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2.. అతిథులు...

Un Stopable: కొత్త అతిథులతో త్వరలోనే రానున్న బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2.. అతిథులు ఎవరంటే?

Un Stopable:నందమూరి బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా తన సత్తా ఏంటో చూపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. బాలకృష్ణ ఏంటి? యాంకర్ ఏంటి? అన్న వారందరికి బాలకృష్ణ గట్టిగా సమాధానం చెప్పారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంతో సందడి చేశారు.బాలయ్య మాట తీరు ఆటపాటలతో ఈ కార్యక్రమానికి మంచి విజయాన్ని అందించారు.

Advertisement

Advertisement

ఇక ఈ కార్యక్రమాన్ని కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో ప్రారంభం కాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో పూర్తి అయ్యింది. ఇక ఈ కార్యక్రమానికి ఎంతో మంది యంగ్ హీరోలు దర్శకులు హాజరయ్యి బాలకృష్ణతో ఎంతో సరదాగా ముచ్చటిస్తూ వారి వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆదరణ దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు అన్ స్టాపబుల్ సీజన్ 2 కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలో ఇప్పటికే ఈ టాక్ షో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్న హీరోలను ఫైనలైజ్ చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరోలు రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం గురించి అధికారికంగా తెలియజేయనున్నారు.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

Most Popular

Recent Comments