...

Ashadh Amavasa 2022: ఆషాడ అమావాస్య ఎప్పుడు వస్తుంది.. ఆ రోజు ఈ చిన్న పని చేస్తే చాలు ధన ప్రవాహమే!

Ashadh Amavasa 2022: ప్రతి నెల అమావాస్య పౌర్ణమి రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఆషాడమాసం ప్రారంభంలో వచ్చే అమావాస్యను ఆషాడ అమావాస్య అని పిలుస్తారు. ఈ ఆషాఢమాస అమావాస్యను హలహరి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ విధంగా ఆషాఢమాసంలో వచ్చే ఈ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ అమావాస్య రోజు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటూ మీ ఇంటికి ధన ప్రవాహం వస్తుంది. అమావాస్య రోజు ఎలాంటి పని చేయాలి అనే విషయానికి వస్తే…

ఆషాడ అమావాస్య రైతులకు ఎంతో ముఖ్యమైన అమావాస్యగా భావిస్తారు ఈ క్రమంలోనే నాగలి పనిముట్లకు సంబంధించిన వస్తువులకు ప్రత్యేక పూజలు చేస్తూ, వారు పండించే పంటలు అద్భుతంగా పండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ పూజలు చేస్తారు. ఇకపోతే ఈ అమావాస్య రోజున వేకువ జామునే నిద్రలేచి నదీస్నానమాచరించి నీటిని తర్పణంగా వదలాలి.ఈ విధంగా సూర్యభగవానుడికి నీటిని తర్పణం వదలటం వల్ల అన్ని శుభఫలితాలు కలుగుతాయనీ, అదేవిధంగా పితృదేవతల ఆత్మలు కూడా శాంతిస్తాయి.

ఈరోజు యాగం చేయడం వల్ల విశేషమైన ఫలితాలను పొందడమే కాకుండా దానధర్మాలు చేయడం ఎంతో ముఖ్యం.ఇలా దానధర్మాలు చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వాదంతో మనపై ఉండటమే కాకుండా, పితృ దోషాలు సైతం తొలగిపోతాయి. మనకు ఉన్నంతలో పేదవారికి ఆహార రూపంలోనూ రూపంలోనూ దానం చేయాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇకపోతే ఈ ఆషాడ అమావాస్య జూన్ 28 వ తేదీ రానుంది. ఈ అమావాస్య తిథి 28 జూన్ 2022, ఉదయం 05:53 నుండి ప్రారంభం అయ్యి, 29 జూన్ 2022, ఉదయం 08:23 గంటలకు ఆషాఢ అమావాస్య తిథి ముగుస్తుంది.