Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
అనసూయ దంపతులు నందుతో వెళ్లడానికి ఒప్పుకోవడంతో తులసి వెళ్లి మీ అమ్మనాన్నలు నీతో రావడానికి ఒప్పుకున్నారని నందుతో చెప్పడంతో అప్పుడు నందు ఎంతో సంతోషపడతాడు. అప్పుడు లాస్య వారు అంత త్వరగా పోవడానికి కారణం ఏమిటి అంటూ నెగిటివ్ గా ఆలోచిస్తుంది.
ఇక తులసి మాత్రం అత్తయ్య మామయ్య ఎటువంటి లోటు లేకుండా గౌరవంగా చూసుకోవాలి అని చెబుతోంది. మరొక వైపు ఫ్రేమ్ బాధపడుతుండగా శృతి ప్రేమ్ ని ఓదారుస్తూ ఇప్పటివరకు నువ్వు నా కెరిర్ గురించి ఆలోచించావు. ఇప్పటినుంచి నా గురించి కాకుండా నీ గురించి ఆలోచించు, కష్టపడు అంటూ ప్రేమ్ ని ప్రోత్సహిస్తుంది.
అప్పుడు శృతి మాట్లాడుతూ నేను ఆంటీ ని తప్పు పట్టడం లేదు ఆంటీ మాటలను తప్పుపడుతున్నాను అని అంటుంది. మరొకవైపు ఇంట్లో అందరూ కలిసి తులసిని నిలదీసినట్టు గా మాట్లాడుతూ ఉండగా అప్పుడు తులసి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు తులసి దేవుడు నాకు పెట్టిన దురదృష్టం కోసం వాళ్ళు వాళ్ళ కొడుకు తో ఉండకపోవడం తప్పు కదా అని పిల్లలకు సర్ది చెబుతుంది.
నందు, లాస్య వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్లి పోవడానికి బయలుదేరుతుండగా అప్పుడు దివ్య నందుని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. లాస్య పై కోప్పడుతూ మీరు మా డాడీ ని ఇక్కడే వదిలేసి వెళ్ళండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని దివ్య అనడం తో లాస్య కోప్పడుతుంది. మరొకవైపు అనసూయ దంపతులు నందు తో వెళ్ళడం ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్లి పోతున్నాము తులసి అంటూ లెటర్ రాసి పెట్టి వెళ్లిపోతారు.
ఆ లెటర్ చదివిన నందు కోపంతో రగిలి పోతూ ఉంటాడు. ఇదంతా నువ్వు ఆడిన నాటకమే అంటూ తులసిని ఫైర్ అవుతాడు. లాస్య కూడా నువ్వు అత్తమామలను మాతో పంపించడం ఇష్టం లేక ఎక్కడో దాచావని నింద వేస్తుంది. వెంటనే తులసి వాళ్లను వెతకడానికి బయటకు వెళ్ళగా పరందామయ్య దంపతులు తులసి ని చూసి దక్కుంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World