Categories: EntertainmentLatest

Focus Movie : ఫోకస్​ చిత్రం నుంచి సుహాసిని లుక్​ రిలీజ్​ చేసిన స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్

Focus Movie : విజ‌య్ శంక‌ర్, అషూ రెడ్డి, సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ లాంటి నటులు కీలక పాత్ర‌ల‌లో తెరకెక్కిస్తున్న చిత్రం పేరు ఫోకస్​. దీనికి జి. సూర్య‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇది ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్. ఓ వ్యక్తికి సంబంధించిన మర్డర్‌ మిస్టరీ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆలరించనున్నాయి.

Advertisement

ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ ఇప్పటికే విడుదల అయ్యింది. ప్రేమికలు రోజు సంద‌ర్భంగా విడుదల చేసిన ఈ సినిమా పోస్ట్​ర్​ కు మంచి ఆదరణ లభించింది. అయితే ఈ మూవీ నుంచి మరో స్పెషల్​ లుక్​ పోస్టర్​ను ప్రముఖ నటి సుహాసిని మ‌ణిరత్నం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ రచయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ హాజరయ్యారు.

Advertisement

ఈ చిత్రంపై విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడారు. సూర్య‌తేజ త‌న తొలి సినిమానే రిలాక్స్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై చేయడం గొప్ప విషయం అని అన్నారు. ఫోక‌స్ అనే ఈ చిత్రం కథాబలం ఉన్న సినిమాగా చెప్పుకొచ్చారు. విజ‌య్‌శంక‌ర్, అషూ రెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నటి సుహాసిని ముఖ్య పాత్ర‌లో నటించడం నిజంగా మంచి విషయం అని తెలిపారు. విడుదల సందర్భంగా టీజ‌ర్ ను చూసిన ఆయన… చాలా బాగుందని చెప్పారు. ఈ సినిమాలో అందరి పాత్రలు చక్కగా ఉన్నాయన కొనియాడారు. దీనిని ఎంకరేజ్​ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్​ చెప్పారు విజయేంద్ర ప్రసాద్​.

Advertisement

ఈ కార్యక్రమంలో చిత్ర ద‌ర్శ‌కుడు సూర్య‌తేజ కూడా మాట్లాడారు. ఎన్నో సినిమాల్లో నటించిన సుహాసిని లాంటి వారికి దర్శకత్వం వహించడం చాలా గొప్పగా ఉందని తెలిపారు. గ్రేట్​ రైటర్​ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ పోస్టర్​ రిలీజ్​ కు రావడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.

Advertisement

బాలచంద‌ర్‌, షియాజీ షిండే, జీవా, సూర్య భ‌గ‌వాన్ లాంటి చిత్ర తారాగణం ఈ చిత్రానికి పని చేయడంతో పాటు మంచి కథ బలం ఉన్న సినిమాగా ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ తెరకెక్కుతుంది. ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్​ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు సూర్యతేజ తెలిపారు. ఈ సినిమాని స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. జి. సత్య ఈ సినిమాకు ఎడిటర్​ గా పని చేస్తున్నారు. జే ప్రభాకర్ రెడ్డి డీఓపీగా చేస్తున్నారు. వినోద్ సంగీతం సమకూర్చుతున్నారు.

Advertisement

Read Also : Singer Parvathi : ఆ ఊరికి బస్సు రావడానికి స్మితా, నేనే కారణం.. ఆ మంత్రుల సాయం మరువలేనిది

Advertisement
Advertisement

Recent Posts

Irctc Down : మళ్లీ స్తంభించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్.. టికెట్ బుకింగ్స్‌కు అంతరాయం!

IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…

17 hours ago

Earthquake AP : ఏపీలో మళ్లీ కంపించిన భూమి.. ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం..

Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…

6 days ago

Earthquake Nepal : నేపాల్‌లో భూకంపం.. 4.8 తీవ్రతతో భూప్రకంపనలు.. భయాందోళనతో జనం పరుగులు!

Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…

6 days ago

Is Bank Open Today : నేడు బ్యాంకులకు సెలవు ఉందా? డిసెంబర్ 21 హాలీడేనా కాదా? పూర్తి వివరాలివే!

Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…

6 days ago

Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా కన్నుమూత

Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…

7 days ago

This website uses cookies.