Actor Vaishnav Tej : మెగాస్టార్ మేనల్లుడు, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ విక్టరీ అందుకున్నాడు. మొదటి సినిమా తోనే భారీ విజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరాడు ఈ యంగ్ హీరో. ఇక ఇటీవల క్రిష్ దర్శకత్వంలో ‘ కొండపొలం ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా అందులో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు వైష్ణవ్ తేజ్.
తాజాగా తన మూడో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసాడు ఈ కుర్ర హీరో. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో… గిరీశయ్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ని కూడా చిత్రా బృందం రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి ” రంగ రంగ వైభవంగా ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందులో వైష్ణవ్ సరసన రొమాంటిక్ సినిమాతో కుర్రకారుకి మత్తెక్కించిన కేతిక శర్మ ఈరోయిన్ గా నటించనుంది. ఈ మేరకు తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ‘ఏంటే ! ట్రీట్ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్’ అని హీరో అడిగే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయ్యింది.
Get Ready for a Romantic Entertainer❤️#PanjaVaisshnavTej & #Ketikasharma in a brand new love story #RangaRangaVaibhavanga 💑
A Rockstar @ThisIsDSP Musical🎹
Directed by @GIREESAAYA#RRVTitleLaunch #RRVTheFilm@SVCCofficial @BvsnP pic.twitter.com/s6JpwRsWBl
— SVCC (@SVCCofficial) January 24, 2022
ఆ తర్వాత హీరోయిన్ ‘అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు తెలుసా ?’ అని అంటుంది. ‘అంటే బాగా ప్రిపేర్డ్ గా వచ్చినట్టు ఉన్నావ్’ అని హీరో, ఆ తర్వాత ‘నీకు బటర్ ఫ్లై కిస్ తెలుసా ?’ అని హీరోయిన్ అంటారు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్, కేతికా శర్మను కిస్స్ చేసుకో బోతున్నట్టుగా చూపించి… తర్వాత ‘నెక్స్ట్ లెవల్ లో ఉంది’ అని హీరో చెప్పే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. దీంతో ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
Read Also : Lord Shiva Worship : శివారాధన చేస్తే శనిదోష సమస్యలకు స్వస్తి…
Tufan9 Telugu News And Updates Breaking News All over World