Benefits of Camphor : కర్పూరం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Camphor
Camphor

Benefits of Camphor : సాధారణంగా ప్రతి ఇంట్లో పూజ గదిలో కర్పూరం తప్పనిసరిగా ఉంటుంది. కర్పూర అన్ని ఎక్కువగా పూజ కోసం వినియోగిస్తారు. కర్పూరం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కర్పూరం అనేక ఆరోగ్య సమస్యలను నిర్మూలించడంలో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కూడా కర్పూరాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. కర్పూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కర్పూరం జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం పొందటానికి ఉపయోగపడుతుంది. తరచూ జలుబు సమస్యతో బాధపడేవారు గోరువెచ్చటి ఆవాల నూనె కర్పూరం కలిపి గొంతుకి మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత వేడి నీళ్లలో కర్పూరం వేసి ఆవిరి తీసుకోవడం వల్ల కూడా జలుబు నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

Advertisement

Benefits of Camphor : మొటిమల సమస్యలకు చెక్ 

కర్పూరంతో జుట్టు సమస్యలను కూడా నివారించవచ్చు. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి తలకు మర్దన చేయటం వల్ల జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పొడిబారటం వంటి సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా కర్పూరం కలిపిన కొబ్బరి నూనెను అంటించడం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

Advertisement

అలాగే మొటిమల సమస్యతో బాధపడే వారికి కూడా కర్పూరం ఎంతో ఉపయోగపడుతుంది. కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల కర్పూరాన్ని కొబ్బరి నూనెతో కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో అంటించడం వల్ల ముఖం మీద ఉన్న మొటిమలు తగ్గటమే కాకుండా వాటి తాలూకా మచ్చలు కూడా తొలగిపోతాయి.

Read Also : Vast Tips: ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా..? ఈ మొక్క నాటితే చాలు మీ సమస్యలన్నీ దూరం..!

Advertisement