beet-root-health-benefits-and-tipsw-for-beauty-and-health
Beet Root Benefits : బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపకరిస్తుంది. బీట్ రూట్ లో ఇనుము అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవటం వల్ల రక్తహీనత సమస్య తగ్గించుకోవచ్చు. దీన్ని రోజు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేయటంతో పాటు రక్తపోటును తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలో తోడ్పడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి. అలానే జీర్ణక్రియలను వేగవంతం చేస్తాయి. విటమిన్ బి దండిగా ఉండే బీట్‌రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. బీట్‌రూట్ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. క్రీడాకారులు బీట్‌రూట్ జ్యూస్ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు.
ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన బియ్యం, నాలుగైదు బీట్ రూట్ ముక్కల్ని కలిపి మెత్తగా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కొద్దిగా పాలు కలిపి దాన్ని ముఖానికి పూతలా రాసుకోవాలి. ఐదు నిమిషాల తరువాత పాలతో ముఖాన్ని మృధువుగా మర్ధన చేయాలి. పదినిమిషాల తరువాత గోరు వెచ్చని నీళ్లతో కడుగితే ముఖ చర్మం కాంతి వంతంగా మారుతుంది. బీట్ రూట్ లోని సిలికాన్ ఖనిజం చర్మాన్ని తాజాగా కనిపించటానికి దోహదపడుతుంది.
బీట్ రూట్ రసానికి చెంచా బాదం నూనె, ఒక చుక్క తేనె కలిపి పెదాలకు పూతలా వేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే నల్లగా మారిన పెదాలు గులాబీ రంగులో మెరిసిపోతాయి. మృత కణాలు తొలగిపోవాలంటే బీట్ రూట్ గుజ్జుగా చేసి దానికి చిటికెడు పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలపై రుద్దాలి. ఇలా చేయటం వల్ల పెదాలు మృధువుగా ఉంటాయి.
రసాయనాలు కలిపిన రంగులు జట్టుకి వేయటం వల్ల హాని కలుగుతుంది. అయితే బీట్ రూట్ రసాన్ని తలపై రాసుకుని రెండు గంటలపాటు ఆరనిస్తే సహజసిద్ధమైన ఢై వేసుకున్నట్లే. అలాగే హెన్నాలో కాస్త బీట్ రూట్ రసాన్ని కలుపు కుంటే జట్టుకు మంచి రంగు వస్తుంది.
Read Also : Karthika Deepam : ఆపరేషన్ జరిగిన పాప తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నా మోనిత!
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.