Hair Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో జుట్టు రాలే సమస్య ఒకటి. చాలా మంది అనేక రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుత కాలంలో ఉన్న ఆహారపు అలవాట్లు,కాలుష్యం ఇందుకు ప్రధాన కారణం. ఇలా అధికంగా జుట్టు సమస్యలతో బాధపడే వారు ఎన్నో రకాల చిట్కాలను పాటించి చూసే ఉంటారు. అదే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసిన జుట్టు సమస్యలు మాత్రం తగ్గడం లేదు.ఈ విధంగా అధిక జుట్టు సమస్యలతో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటి ఎక్కడ తెలుస్తుంది..
మన ఇంట్లో దొరికే బియ్యం ,మెంతులు, నారింజ తొక్కల తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.మనం ఎంత పరిమాణంలో అయితే బియ్యం తీసుకుంటామో అంతే పరిమాణంలో మెంతులు తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అవి మునిగే వరకు నీళ్ళు పోసి అందులో నారింజ తొక్కలు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా మరుసటి రోజు ఉదయం వీటిని మిక్సీలో మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మాడు నుంచి వెంట్రుకల వరకూ బాగా ఆటించాలి.
ఈ మిశ్రమాన్ని తలకు రాసిన అరగంట తరువాత షాంపూ పెట్టీ స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకరోజు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.బియ్యం మెంతులు కమలాపండు తొక్కలను ఎన్నో రకాల పోషక విలువలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.వీటి వల్ల జుట్టు సమస్యలు తొలగిపోయి ఒత్తుగా పెరుగుతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World