Sreeja Konidela _ Chiranjeevi Condition to Sreeja Konidela Third Marriage
Sreeja Konidela : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటుందంటూ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా.. మూడో పెళ్లి కూడా ఆమె సిద్ధమైపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శ్రీజ గురించి ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటోంది. కల్యాణ్ దేవ్ తో విడిపోయిన తర్వాత శ్రీజ మూడో పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ ఓ వార్త వినిపిస్తోంది.
అయితే ఈ విషయంలో చిరంజీవి మాత్రం శ్రీజ మూడో పెళ్లి (Sreeja Third Marriage) చేసేందుకు అంగీకరించలేదట.. కానీ, కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం ఒక కండిషన్ ప్రకారమే శ్రీజ మూడో పెళ్లి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మెగా ఫ్యామిలీకి సంబంధించి తన వ్యక్తిగత విషయాలను శ్రీజ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మరింత ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని బ్రేకప్ చెప్పేసిన శ్రీజపై నెటిజన్లు కూడా తిట్టిపోస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. మెగా ఫ్యామిలీకి ఇష్టం లేకుండా మొదట ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ.. కొన్నాళ్లకే అతడితో బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత పెద్దలు కుదర్చిన రెండో భర్తగా కల్యాణ్ దేవ్‌ను పెళ్లాడింది. అతడితో ఒక పాప పుట్టిన తర్వాత కొన్నాళ్లకే కల్యాణ్ దేవ్ (Kalyan Dev) తో కూడా బ్రేకప్ చెప్పేసింది. ఇద్దరు కొన్నాళ్ల నుంచి విడిగానే ఉంటున్నారు. విడాకులు తీసుకున్నారంటూ ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. దీనిపై మెగా ఫ్యామిలీ (Mega Family)తో పాటు కల్యాణ్ దేవ్ కూడా స్పందించలేదు.
ఇప్పడు శ్రీజ మూడో పెళ్లికి సంబంధించి మెగా కంపౌండ్ నుంచి ఒక సమాచారం బయటకు వచ్చింది. వచ్చే నవంబర్ ఆఖరి వారంలో శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందని టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఈ పెళ్లి విషయంలో మెగా కుటుంబంలో ఎవరికి నచ్చలేదుట.. అందుకే ఈసారి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా పెళ్లి చేయబోతున్నారట. శ్రీజ కొణిదెల సంతోషం కోసమే ఈ పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట.
అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. శ్రీజను పెళ్లి చేసుకోబోయే మూడో అల్లుడుకి చిరంజీవి ఊహించని ట్విస్ట్ ఇచ్చారట.. అంతేకాదు.. మెగా అల్లుడికి ఒక కండిషన్ కూడా పెట్టారట.. దానికి ఒప్పుకుంటేనే శ్రీజతో పెళ్లి చేస్తానని చిరంజీవి స్పష్టం చేశారట.. ఎందుకంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. అందులో కొందరు మాత్రమే నిలబడగలిగారు. మెగాస్టార్ ఇమేజ్ (Megastar Family)తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలు ఎక్కువ అయిపోయారు. సినిమాల్లో మొత్తం మెగా హీరోలే (Mega Heros) ఏంటి అంటూ సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ వస్తున్నాయి.
మెగా ఫ్యామిలీలోకి మూడో అల్లుడిగా (Mega Alludu) రాబోయే శ్రీజ కాబోయే భర్తకు కూడా ఈ కండిషన్ పెట్టారట.. మెగా అల్లుడిగా పిలిపించుకోవచ్చు కానీ, సినీ ఇండస్ట్రీలో హీరో అవుతానంటే మాత్రం అది కుదరదని మెగాస్టార్ చెప్పేశారట.. ఒకవేళ హీరోగా ఎదగాలనే ఏదైనా కోరిక ఉంటే మాత్రం అందుకు మెగా ఫ్యామిలీ సపోర్టు చేయదని, అసలు హీరో కావాలనే ఆలోచన ఉండొద్దని కండిషన్ పెట్టినట్టు తెలిసింది.
అందుకు మెగా అల్లుడు ఓకే చెప్పాడా? లేదా అనేది క్లారిటీ లేదు.. మెగా అల్లుడిగా అడుగుపెట్టి హీరో అయిపోదామనుకుంటే అంత ఈజీ కాదని, సినిమాల్లో హీరోగా రాణించాలంటే మెగా ఫ్యామిలీ సపోర్టు ఉంటే సరిపోదని, అందుకు వారిలో టాలెంట్ కూడా ఉండాలని, అదృష్టం కూడా ఉంటేనే ఎవరైనా మెగా హీరోగా రాణించగలరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : Jana Gana Mana Movie : పూరి ‘జనగణమన’ అటకెక్కడానికి మహేష్ బాబు శాపమే కారణమా?!
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.