Woman Lover Sends Message Private Photos to Her Husband Whatsapp
Husband Whatsapp : భర్త మొబైల్ ఫోన్ కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన భార్య ఒక్కసారిగా షాక్ అయింది. ఇదంతా ప్రియుడు పనేనని తెలిసి చివరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన కేరళలోని వెల్లరాడలో చోటుచేసుకుంది. తన వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందనే భయంతో బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు ప్రియుడికి ఫోన్ కాల్ చేసి తాను చనిపోతున్నట్టుగా చెప్పింది. అతడు ఎంతగా నచ్చజెప్పిన ఆమె వినలేదు. భర్తలేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
మహిళ ఆత్మహత్య చేసుకోవడాన్ని ముందుగా పోలీసులు సహా స్థానికులు భర్తతో మనస్పర్థల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని భావించారు. కానీ, కేసు విచారణలో అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిదంటే.. ప్రియుడు తమ వివాహేతర సంబంధం గురించి వాట్సాప్‌లో తాము మాట్లాడుకున్న వాయిస్ సహా స్క్రీన్‌షాట్ ఆమె భర్త వాట్సాప్‌కు షేర్ చేశాడు. వారిద్దరూ చనువుగా ఉన్న ఫొటోలను కూడా పంపాడు ప్రియుడు ఇలా చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.. 29ఏళ్ల వివాహితకు కొన్నేళ్ల క్రితం పెళ్లి అయింది. ఆమెకు మూడేళ్ల బాబు ఉన్నాడు. అయితే ఆమె ఓ యువకుడితో పరిచయడం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. నాలుగేళ్లుగా భర్తకు తెలియకుండా సీక్రెట్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మధ్యన ఇద్దరికి డబ్బుల విషయంలో గొడవలు వచ్చాయి. ప్రియుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
ఇద్దరి వ్యవహారం తన భర్తకు చెబుతానని బెదిరించసాగాడు. చివరకు అన్నంత పని చేశాడు. ఆమె భర్తకు తనతో చనువుగా ఫొటోలను వాట్సాప్ చేశాడు. ఆ ఫొటోలను చూసిన భర్త ఆమెను నిలదీశాడు. ఆ ఫొటోలు భర్త వాట్సాప్‌కు పంపిన విషయం తెలిసి ఆమె షాకయింది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైంది. చివరికి ప్రియుడికి ఇంట్లో భర్త లేని సమయంలో వీడియో కాల్ చేసి చనిపోతున్నానని చెప్పింది. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Read Also : Cyber Crime : కంపెనీ మెయిల్ హ్యాక్ చేసి రూ. 46 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ళు… ఏం జరిగిందంటే !
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.