Woman fighting with leopard: అమ్మా ఆకలేస్తుందంటూ ఆడీ ఆడి వచ్చిన కూతురుకు అన్నం వడ్డించింది. ఒక దగ్గర కూర్చోబెట్టి కడుపు నిండా తినమని చెప్పి తన పనుల్లో నిమగ్నమైంది. కానీ ఒక్కసారిగా కూతురు ఏడుస్తూ… గట్టిగా కేకలు వేయడం విన్న తల్లి ఒక్క ఉదుటున కూతురున్న చోటుకు వచ్చి చూసింది. కానీ అప్పటికే తన బిడ్డను ఎత్తుకెళ్తున్న పులిని చేసి… షాక్ కి గురైంది. అయినా సరే తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆ పులి వెంట పడి కూతురును కాపాడుకుంది . ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రకు చెందిన జ్యోతి పుపాల్వర్ తన మూడేళ్ల కూతురితో పాటు చంద్రాపూర్ ప్రాంతంలోని దుర్గాపూర్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటుంది. అయితే ఆ చిన్నారికి అన్నం పెట్టి ఇంట్లోకి వెళ్లగా.. ఓ పులి వచ్చి పాపను ఎత్తుకెళ్లింది. కేకలు విని బయటకొచ్చిన తల్లి.. ఆ ఘటనను చూసి భయపడిపోయింది. కానీ ప్రాణంగా పెంచుకుంటున్న తన కూతురును కాపాడుకునేందుకు పులితో పోరాడింది. చివరకు పాపను పులి నుంచి విడిపించుకుంది. వెంటనే గాయపడ్డ కూతురిని స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించింది. తన కూతురు కోసం ఓ పెద్ద కర్రతో చిరుత మూతిపై పదే పదే కొట్టానని ఆమె వివరించింది. దాంతో చిన్నారిని వదిలేసిందని వెల్లడించింది. అయితే ఇప్పడికే ఆ ప్రాంతంలో ఆ చిరుత 15 మందిని పొట్టన పెట్టుకుంది.