Crime News: ప్రస్తుతం రష్యాలో రష్యన్ మోడల్ గ్రెట్టా వెడ్లెర్ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు ప్రస్తుతం రష్యాలో యుద్ద వాతావరణ ఉంటే మరొకవైపు స్టార్ మోడల్ హత్యకు గురవడం సంచలనంగా మారింది. గ్రెట్టా వెడ్లెర్..ఒక మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అయితే ఆమె రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యతిరేకి. గతంలో పుతిన్‌ను సైకోపాత్ అంటూ పుతిన్‌ను తిడుతూ.. 2021 జనవరిలో సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్ చేసింది.
ఇలా పోస్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత గ్రెట్టా కనిపించకుండా పోయింది. చివరికి పాత సూట్ కేసులో ఆమె శవం లభ్యం అయ్యింది. పుతిన్ వ్యతిరేకి అయిన మోడల్ పుతిన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. “బాల్యంలో పుతిన్ చాలా అవమానాలను చవిచూశాడు. అందువల్ల న్యాయ విద్యను విడిచిపెట్టి KGB లో చేరాడు. అందుకే నా దృష్టిలో అతనొక మానసిక రోగి” అంటూ కామెంట్లు చేసిందామె. పుతిన్ గురించి ఇలా వాక్యాలు చేసిన తర్వాత కొన్నివారాలకు ఆమె కనిపించకుండా పోవటంతో నానా కథనాలు వెలువడ్డాయి.
మోడల్ తాజాగా హత్యకు గురైందంటూ రష్యా దర్యాప్తు కమిటీ ఒకటి ఓ వీడియోను రిలీజ్ చేసింది. కేవలం డబ్బు కోసం జరిగిన వాగ్వాదంలో ఆమెను చంపేసినట్లు ఆమె ప్రియుడు కోరోవిన్ అంగీకరించాడు. పుతిన్ గురించి వ్యాఖ్యలు చేసినందుకు.. ఆమె హత్యకు ఎటువంటి సంబంధం లేదు అని ఆమె ప్రియుడు వెల్లడించారు. మోడల్ మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.