Nurse Naga Chaitanya Death Mystery : నర్సు నాగచైతన్య మర్డర్ కేసులో నిందితుడు కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందానగర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితుడు కోటిరెడ్డిని ఒంగోలు నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. విచారణలో కత్తితో నాగచైతన్య గొంతు కోసి తానే హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.
కోటిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అతడ్ని రిమాండ్‌కు తరలించనున్నారు. హత్య అనంతరం గాయాలతోనే నిందితుడు భయంతో ఒంగోలు పారిపోయాడు. అక్కడే ఒక ఆస్పత్రిలో చికిత్స పొందాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మండలం కరవదికి చెందిన నాగచైతన్య(24) హైదరాబాద్ నల్లగండ్లలోని సిటిజన్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది.
జరిగింది ఇదే :
గుంటూరు జిల్లాకు చెందిన రెంట చింతల ప్రాంతంలో గాదె కోటిరెడ్డి మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురికి మధ్య పరిచయడం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమె ఒత్తిడి చేయసాగింది నాగచైతన్య. కోటిరెడ్డిపై ఆమె ఒత్తిడి తేవడంతో అతడు నిరాకరించాడు.
Read Also : Skeleton Mystery : ఆ అపార్ట్‌మెంటులో సోదరుడి అస్థిపంజరంతో చిన్నారులు.. చంపింది తల్లేనా?
ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులోనూ ఇరువురి సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో అతడి ఇంట్లో పెళ్లికి నిరాకరించారు. కోటిరెడ్డి అనుకున్న ప్లాన్ అమలు చేశాడు. పక్కా స్కెచ్‌తో హైదరాబాద్ వచ్చాడు. అక్టోబర్ 23న నల్లగండ్లలో ఓ హోటల్‌లో గదిలో దిగారు. ఆదివారం రాత్రి వరకు తలుపులు తీయలేదు.
హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే తమ దగ్గరి కీలతో తలుపులు తెరిచి చూశారు. నాగచైతన్య రక్తపు మడుగులో పడి ఉంది. కోటిరెడ్డి మాత్రం కనిపించలేదు. వెంటనే హోటల్ సిబ్బంది చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోటిరెడ్డి ఆమెను హత్య చేసి పారిపోయినట్టు పోలీసులకు అనుమానం వచ్చింది.
ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు కోటిరెడ్డి. ఘటన స్థలంలో దొరికిన ఆధారాలతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పారిపోయిన కోటిరెడ్డి కోసం పోలీసులు ఒంగోలు వెళ్లారు. అక్కడే అతన్ని పట్టుకున్న పోలీసులు విచారణ కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు. తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో కోటిరెడ్డి తానే హత్యచేసినట్టు ఒప్పుకున్నాడు.
Read Also : Pawan Death Note : అమ్మా.. నాన్న.. ఈ మొబైల్ అమ్మేసి.. నా అంత్యక్రియలు చేయండి..!
Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…
Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…
Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…
Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
This website uses cookies.