...
Telugu NewsCrimeLove story : లేచిపోతున్న కూతురును పట్టుకొచ్చి పెళ్లి చేసింది.. ఎవరితోనో తెలుసా?

Love story : లేచిపోతున్న కూతురును పట్టుకొచ్చి పెళ్లి చేసింది.. ఎవరితోనో తెలుసా?

Love story : బీహార్ రాజధాని పాట్నా శివార్లలోని దానాపూర్ లో ఓ ఆశ్చర్యకరమైన ప్రేమ పెళ్లి వెలుగులోకి వచ్చింది. అయితే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో ఆమె వారిని వెంబడించి మర పట్టుకుంది. ప్రియురాలి తల్లి వారిని పట్టుకొని గట్టిగా అరవడం ప్రారంభించింది. దీంతో గ్రామస్థులు గుమిగూడారు. ప్రేమ జంటను ఇదేంటని ప్రశ్నించగా… తాము పెళ్లి చేసుకుంటామని, ప్రాణం పోయినా ఒకరినొకరు వదిలి ఉండమని చెప్పడంతో గ్రామస్థులంతా కలిసి వారికి పెళ్లి చేశారు. అయితే బాలిక తల్లి కూడా ఇందుకు ఒప్పుకోవడం గమనార్హం.

Advertisement
Mother mademarriage with daughters boy friend at bihar
Mother mademarriage with daughters boy friend at bihar

కర్పి పీఎస్ పరిధిలోని బెల్హెడా గ్రామానికి చెందిన సత్యేంద్ర పండిట్ కుమారుడు అనిల్ అర్వాల్… ఖేరిమోడ్ పీఎస్ పరిధిలోని కోడిహర గ్రామానికి చెందిన యోగేంద్ర పండిట్ కుమార్తె ఉందు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వారు ఒప్పుకోకపోవడంతో లేచిపోవాలనుకున్నారు. విషయాన్ని గుర్తించిన బాలిక తల్లి వారిని వెంబడించి పట్టుకుంది. నిలబడ్డ చోటే గొడవ చేస్తూ అందరినీ పిలిచింది. గ్రామస్థులంతా వచ్చి వారి ఇష్ట ప్రకారం ప్రేమికులిద్దరికీ పెళ్లి చేశారు. అయితే వీరి పెళ్లికి బాలికి తల్లి ఒప్పుకోవడం, పారిపోయే వారి పెళ్లి రోడ్డు మీద అవడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు