Sarees theft: ఆ తల్లీ కూతుర్లిద్దరికీ… ఖరీదైన పట్టు చీరలంటే పిచ్చి ప్రేమ. కట్టిన చీర మళ్లీ కట్టకుండా ఉండేందుకు తెగ ఇష్టపడుతుంటారు. కానీ వారి ఆర్థిక స్థోమతకు వారు పట్టు చీరలు కొనుక్కునే రేంజ్ లేదు. కానీ ఎలాగైనా సరే వారి కలలను నిజం చేసుకోవాలనకున్నారు. అందుకోసం వారిద్దరూ కలిసి ఓ ప్లాన్ వేశారు. చీరల కోసం ఏదైనా పని చేయాలనకున్నారమో అనుకుంటున్నారా.. లేదండీ.. అదంతా టైమ్ వేస్ట్ అనుకొని నేరుగా బట్టల షాపులకు వెళ్లి ఖరీదైన పట్టు చీరలు దొంగతనం చేయడం ప్రారంభించారు. ఇలా దొంగతనం చేస్తూ.. చివరకు పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడుతున్నారు.
హైదరాబాద్ లోని అంబర్ పేట సలీం నగర్ కాలనీకి చెందిన నల్లూరి సుజాత గృహిణి. ఆమె కుమార్తె నల్లూరి వెంకట లక్ష్మీ. ఇద్దరూ ఖరీదైన చీరలు ధరించి విలాసవంతంగా ఉండాలి ఆశ. దీంతో ఇద్దరూ కలిసి పెద్ద పెద్ద షోరూంలకు వెళ్లి చీరలు చూస్తున్నట్లు నటించి వాటిని దొంగతనం చేయడం ప్రారంభించారు. ఈనెల 1న జూబ్లీహిల్స్ రోడ్డు మెంబర్ 45లోని తలాషా క్లాత్ షోరూంకు వచ్చారు. లక్షా పదివేల విలువ చేసే ఐదు పట్టు చీరలను చోరీ చేశారు. ఎవరూ గమనించలేదని 24న రోడ్డు నెంబర్ 10లో గోల్డెన్ థ్రెడ్స్ కు వెళ్లి 2 లక్షల 80 వేల రూపాయల విలువ చేసే జాకెట్లను చోరీ చేశారు. షోరూంల నిర్వాహకుల ఫిర్యాదుతో… సీసీ కెమెరాల ఆధారంగా తల్లీ కుమార్తెలను అరెస్ట్ చేశారు.