Telugu NewsCrimeCrime news: నరబలికి ముందు రేప్.. భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం!

Crime news: నరబలికి ముందు రేప్.. భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం!

Crime news: కేరళ నరబలి ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో విషయాలు మనిషి నాగరికతనే ప్రశ్నించేలా ఉన్నాయి. సిరి సంపదలు వస్తాయని నరబలికి దంపతులు అంగీకరించడం, మనిషి బాడీ పార్టులను ఉడికించుకుని తింటే యవ్వనులుగా ఉంటారనే మాటలు నమ్మారంటే వాళ్లెంత పిచ్చి వాళ్లో అర్ధం చేసుకోవాలి. విషయాలు వెలుగులోకి వస్తున్నా కొద్దీ… ఇద్దరు మహిళలను మూఢ నమ్మకాలతో అత్యంత దారుణంగా హతమార్చడమే కాదు, సొంత భార్యపైనే అత్యాచారం చేస్తానంటే అందుకు కూడా అంగీకరించాడు ఆ వ్యక్తి.

Advertisement

Advertisement

ఫేస్ బుక్ ద్వారా కుట్ర పన్నిన మహమ్మద్ షఫీ అనే దుర్మార్గుడు భగవాల్ సింగ్ కు మాంత్రికుడిగా పరిచయం అయ్యాడు. అప్పుల గురించి చెప్పి పరిష్కారం చెప్పాలన్నాడు. ఆడవాళ్లను నరబలి ఇస్తే సిరి సంపదలు కల్గుతాయని చెప్పడంతో… భగవాల్ సింగ్ సరే అన్నాడు. అలాగే నీ భార్యతో సంగమించాలని చెప్పినా సరే అన్నాడు.

Advertisement

అనంతరం భగవాల్ సమక్షంలోనే ఆయన భార్య లైలాపై మహమ్మద్ షఫీ లైగింకి దాడి చేశాడు. అనంతరం ఇద్దరు మహిళలు రొస్లిన్, పద్మలను రంగంలోకి దించాడు. వారిద్దరినీ ముక్కలుగా నరికి వారి.. శరీరాలను ఉడికించుకుని తిన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు