Cheddi Gang : చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది వెన్నులో వణుకు పడుతుంది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. కేవలం ఒంటిపై చెడ్డీలు వేస్కొని , మొహానికి మాస్కు పెట్టుకొని, చేతిలో రాడ్లతో, శరీరమంతా నూనె పోస్కొని తిరుగుతుంటారు. శివారు ఇళ్లే లక్ష్యంగా చేస్కొని దొంగతనాలకు పాల్పడుతుంటారు. మాట వినని ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా వీరు వెనుకాడరు. భయపడి అడిగివన వన్నీ ఇచ్చేసిని వారిని మాత్రమే ప్రాణాలతో వదిలేస్తారు. అంతటి దుర్మార్గుల గ్యాంగ్.. మళ్లీ హల్ చల్ చేస్తున్నారు. ఆ మాయదారి చెడ్డీ గ్యాంగ్ దొంగలు నిజామాబాద్ నగరంలో కలకలం సృష్టిస్తున్నారు.
అయితే చెడ్డీ గ్యాంగ్ దొంగలు సిటీలో అడుగు పెట్టి.. అర్ధరాత్రిళ్లు రోడ్లపై సంచరిస్తున్న సీసీటీవీ ఫుటేజీ పలీసులకు దొరికింది. ఆ నోటా ఈ నోటా పాకి అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. అంతేనా అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరు గజగజా వణికిపోతున్నారు. ఎప్పుడు, ఎలా ఈ చెడ్డీ గ్యాంగ్ అటాక్ చేస్తుందోనని విపరీతమైన టెక్షన్ పడిపోతున్నారు. అప్రమత్తమైన పోలీసులు ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్కోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఏ సమయంలో అయినా సరే అనుమాన్సదంగా ఎవరు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.
Read Also : Viral Video: బైక్ పై తల్లి మృతదేహంతో 80కి.మీ. ప్రయాణం.. ఇంకెన్ని రోజులు ఈ అమానవీయం