Success Story : దుబాయ్ రూ.1.1 కోట్ల ప్యాకేజీని వదిలి ఇండియాకు, సొంత బిజినెస్‌తో కోట్లలో ఆదాయం : ఆరోహి సక్సెస్ స్టోరీ

  • దుబాయ్‌లో రూ. కోటికి పైగా జీతం వదిలి ఇండియాకు వచ్చిన యువతి
  • తల్లి కోసం భారత్ కు వచ్చి సొంత కంపెనీతో కోట్ల టర్నోవర్
  • డ్యాన్సింగ్ కౌ పేరుతో కొత్త బ్రాండ్, కొద్ది నెలల్లోనే ఫుల్ పాపులర్

Success Story Aarohi Surya : దుబాయ్‌లో కోట్లలో ప్యాకేజీ.. అలాంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసింది.. ఇండియాకు వచ్చి సొంత బిజినెస్ స్టార్ట్ చేసింది.. ఇప్పుడు కోట్లలో ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఆమె ఎవరో కాదు.. ఆరోహి సూర్య.. ఈమె ఎందరికో స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచింది.

ఇప్పటివరకూ మీరు ఎంతమందో మహిళల సక్సెస్ స్టోరీ గురించి వినే ఉంటారు. కానీ, ఈ రోజు మనం దుబాయ్‌లో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలి భారత్ తిరిగి వచ్చిన మహిళ విజయ గాథను ఇప్పుడు తెలుసుకుందాం..

అప్పుడే మదిలో వ్యాపార ఆలోచన :
తల్లి అనారోగ్యం కారణంగా ఆరోహి ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఎదురైంది. అప్పుడే ఆమెలో వ్యాపార ఆలోచన మొదలైంది. ఆమె ఆలోచన కేవలం తన కుటుంబానికి మాత్రమే కాదు.. చాలా మందికి ఉపాధినిచ్చింది. లక్నో నివాసి అయిన ఆరోహి సూర్య డ్యాన్సింగ్ కౌ అనే బ్రాండ్‌కు సీఈఓగా ఉన్నారు.

Success Story : ఆరోహి సూర్య సక్సెస్ స్టోరీ :

దుబాయ్‌లో ఆరోహికి మంచి ఉద్యోగం.. కానీ, ఆమె భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ఆమె తల్లి అనారోగ్యం కారణంగా తప్పలేదు. కానీ, అదే ఆమెకు కలిసొచ్చింది. డ్యాన్సింగ్ కౌ వ్యాపార ఆలోచన వచ్చేలా చేసింది. అంచెలంచెలుగా ఎదుగుతూ సక్సెస్ ఫుల్ బ్రాండ్‌గా మారింది.

Read Also : PM Kisan 22nd Installment : రైతులకు అలర్ట్ : ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 22వ విడత రూ. 2,000 ఖాతాలో ఎప్పుడొస్తుంది?

ఆరోహి స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె తల్లికి డయాబెటిస్ ఉందని తెలిసింది. డాక్టర్ ఆమెకు పాలు, పాల ఉత్పత్తులను తినకూడదని సలహా ఇచ్చారు. దీని ఫలితంగా ఆరోహి డయాబెటిస్, ఇతర ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వారికి ప్రయోజనకరంగా ఉండేలా సులభంగా జీర్ణమయ్యే పాలను తయారు చేసేలా ప్రేరేపించింది.

దుబాయ్‌లో ఉద్యోగం వదిలేసి :

భారత్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఆరోహి సూర్య దుబాయ్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత అక్కడే ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. మార్కెటింగ్ హెడ్‌గా పనిచేస్తూనే ఆమె దుబాయ్‌లో సొంత స్టార్టప్, హైయల్లాను ప్రారంభించింది. అయితే, ఆమె 2022లో భారత్ తిరిగి వచ్చినప్పుడు ఆ స్టార్టప్‌ను అమ్మేసింది.

జర్నీ ఎలా మొదలైందంటే? :

ఆరోహి సూర్య తల్లి కోసం ఓట్ మిల్క్ తయారు చేయాలనుకుంది. కానీ, అంత సులభం కాదు. ఆమె పూర్తి స్థాయిలో చేసేందుకు దాదాపు 10 నెలలు పట్టింది. ఆ తర్వాత ఆమె తన భర్తతో కలిసి సేవింగ్స్ డబ్బుతో స్టార్టప్‌ను ప్రారంభించింది.

తమ ప్రొడక్టు తయారు చేసేందుకు పూణేలో మొక్కల ఆధారిత పాల ఫ్యాక్టరీని కూడా స్థాపించారు. 2023లో తమ ప్రొడక్ట్‌కు డ్యాన్సింగ్ కౌ అనే పేరుతో కంపెనీ ప్రారంభించారు. ప్రారంభం నుంచే సోషల్ మీడియా మార్కెటింగ్‌తో బాగా పాపులారిటీ సాధించింది.

డ్యాన్సింగ్ కౌ బ్రాండ్‌కు భారీ డిమాండ్ :
2023లో డ్యాన్సింగ్ కౌ బ్రాండ్ ప్రారంభించింది. అప్పటినుంచి ఈ బ్రాండ్ ఉత్పత్తులు ఇప్పుడు 500కి పైగా వ్యాపారాలలో వాడుతున్నారు. ఈ ప్రొడక్టులు ఆన్‌లైన్, రిటైల్ మార్కెట్లలో కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఆమె కంపెనీ వార్షిక ఆదాయంలో రూ. 2 కోట్లకు పైగా సంపాదిస్తోంది. సొంత బిజినెస్ ప్రారంభించాలనుకునే నేటి యువతకు ఆరోహి ప్రేరణగా నిలిచింది.