...

Guppedantha Manasu : రిషికి ట్విస్ట్ ఇచ్చిన వసు.. ఏకంగా జగతిని అమ్మా అని పిలవాలి అంటూ!

Guppedantha Manasu Feb 3 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతి.. రిషి కి బట్టలు ఇవ్వమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక వసు ఎలాగైనా జగతి తీసుకొచ్చిన బట్టలను రిషికి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. ఇక రిషి ని తన దగ్గరికి పిలిపించుకుంటుంది. రిషితో తనకు రెండు గిఫ్టులు కావాలని అని.. బట్టలు తీసి చేతిలో పెట్టి ఇవి వద్దనకుండా తీసుకోవడమే గిఫ్ట్ అని అంటుంది.

Advertisement
vasu-gave-a-twist-to-rishi-by-says-rishi-call-jagati-by-amma-word
vasu-gave-a-twist-to-rishi-by-says-rishi-call-jagati-by-amma-word

ఇక రెండో గిఫ్టు గురించి రిషి అడగటంతో.. దాని గురించి చెబుతూ.. చిట్టీలు వేసి అందులో ఎక్కువ ఎవరికి ఎస్ వస్తాయో వారు గెలిచినట్లు. ఓడిపోయిన వాళ్లు ఏది చెబితే అది వినాలి అంటూ ట్విస్ట్ ఇస్తుంది. ఇక వసు గెలవడంతో రిషికి ఒక ట్విస్ట్ ఇస్తుంది. సార్ జగతి మేడమ్ ను ఈ రోజంతా అమ్మ అని పిలవాలి అని అనడంతో దానికి రిషి నో అని గట్టిగా అరుస్తాడు. ఇలా అడుగుతున్నావ్ ఏంటి అంటూ కోపంతో రగిలిపోతాడు. వెంటనే వసు ఏం జరిగిందని అడగడంతో రిషి ఆ ఊహలో నుంచి బయట పడతాడు.

Advertisement

Guppedantha Manasu : రిషికి ట్విస్ట్ ఇచ్చిన వసు..

అదంతా రిషి ఊహించుకుంటాడు. ఇక వసు రిషిని కోపగించుకోవద్దని ఇదే సెకండ్ గిఫ్ట్ అని అంటుంది. దానికి రిషి సరే అంటాడు. వసు నా సెలక్షన్ ఎలా ఉంది సార్ అని అడుగుతుంది. బాగానే ఉంటుంది లే అని.. మరి నా సెలక్షన్ ఎలా ఉంది.. నువ్వు వేసుకున్న లంగా వోణిని నేనే తీసుకు వచ్చాను అని రిషి అంటాడు. దానికి వసు సంతోషపడుతుంది. మరోవైపు ధరణి.. జగతి తో సరదాగా మాట్లాడుతుంది. ఇక్కడే ఉంటే బాగుండు అని ఉంటుంది.

Advertisement

అలా వారిద్దరూ మాట్లాడుతూ ఉండగా దేవయాని వచ్చి జగతిని ఉద్దేశించి మాట్లాడుతుంది. అంతేకాక జగతికి గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. తిరిగి జగతి వెటకారంగా కౌంటర్ ఇస్తుంది. తరువాయి భాగంలో జగతి తెచ్చిన బట్టలను రిషి వేసుకుంటాడు. ఇక గౌతమ్ డ్రెస్ బాగుందని.. సెలక్షన్ ఎవరిది అని అంటాడు. ఇక రిషి మాత్రం అది వసునే తీసుకు వచ్చిందని అనుకుంటాడు. కానీ దేవయాని వెంటనే జగతి పేరు చెప్పటం తో రిషి అన్నం తినకుండా అలాగే ఉంటాడు. దీనిని బట్టి చూస్తే రిషి కోపంగా ఉండకూడదని వసు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

Advertisement

Read Also : Guppedantha Manasu : వసుకు పెద్ద పరీక్ష పెట్టిన జగతి.. తట్టుకోలేకపోతున్న గౌతమ్!

Advertisement
Advertisement