...

Guppedantha Manasu : వసు రాకతో షాక్ లో ఉన్న దేవయాని!

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతి మహేంద్రతో వసుధారకు ప్రేమ లేఖ రాసిన విషయం రిషి నీకు ఏమైనా చెప్పాడా అని అడుగుతుంది. దానికి మహేంద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత ‘ఎవరో ఆకతాయి రాసి ఉంటాడు..లే ‘అని లైట్ తీసుకుంటాడు. ఆ తరవాత లెటర్ గురించి అదే పనిగా ఆలోచిస్తున్న జగతి ఇదివరకు ఆ లెటర్ లో రైటింగ్ ఎక్కడో చూసినట్టుగా సందేహం వస్తుంది.

Advertisement

Advertisement

ఆ సందేహాన్ని మహేంద్ర కు చెప్పగా.. ఎంతో మంది స్టూడెంట్ ల చేతివ్రాత చూసిన నీకు అలానే అనిపిస్తుంది లే లైట్ తీసుకో అన్నట్లు మాట్లాడుతాడు. మరోవైపు గౌతమ్ లెటర్ కింద కింద పడినప్పటికీ.. లెటర్ గురించి వసు పాజిటివ్ గా రియాక్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు వసు, రిషికు ఫోన్ చేసి ఒక దగ్గరకు రమ్మని చెబుతుంది. ఇద్దరు కలుసుకొని మాట్లాడుకుంటారు. ఇక వసుధార లెటర్ రాసిన వ్యక్తి ని ఎంతో బాగా మెచ్చుకుంటుంది.

Advertisement

ఆ లెటర్ రాసిన వ్యక్తి ఎవరో ఒకసారి చూడాలి అని అంటుంది. దానికి నవ్వాలో ఏడవాలో రిషికు అర్థం కాదు. ఆ తర్వాత రిషి తన జేబులో చాక్లెట్ తీస్తాడు. దాన్ని రిషి.. నోటితో కొరికి రెండు పీసస్ లా చేసి ఇద్దరు షేర్ చేసుకుంటారు. దానికి ఇద్దరూ..’లవ్ బి జి యం’ ను ఓ రేంజ్ లో వేసుకుంటారు. ‘మొత్తానికి నేను రాసిన ప్రేమ లేఖ వసుధార నచ్చింది నాకు ఇది చాలు ‘ అని మనసులో అనుకుంటూ రిషి తెగ సంబరపడిపోతూ ఉంటాడు.

Advertisement

ఆ తర్వాత రిషి , కారులో వెళుతుండగా ఒక చోట కారు ఆపి వసుధార చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని ‘ఆ ప్రేమ లేఖ రాసింది నేనే ఐయాం సో హ్యాపీ ‘ అంటూ గట్టిగా అరుస్తాడు. లవ్ లెటర్ పాస్ చేసినందుకు గౌతమ్ కు గట్టిగా అరిచి థాంక్స్ చెబుతాడు. ఆ తర్వాత రిషి, వసుధార ని అర్జెంటుగా తన పెద్దమ్మ ఇంటికి రమ్మని చెబుతాడు. వసుధార ఇంటికి వస్తుందని తన పెద్దమ్మకు రిషి చెప్పగా.. రిషి ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు. ఈ లోగా వసుధార అక్కడికి రానే వస్తుంది. మరి రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

Read Also : Guppedantha Manasu: వసుధారకు లవ్ లెటర్ రాసిన గౌతమ్..టెన్షన్ పడుతున్న రిషి..?

Advertisement
Advertisement