Realme 15 Pro 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ అదుర్స్.. ఏఐ ఫీచర్ల కోసమైన కొనేసుకోండి.. ధర కూడా చాలా తక్కువే..

Realme 15 Pro 5G : రియల్‌మి కొత్త ఫోన్ కావాలా? రియల్‌మి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ వచ్చేశాయి. రియల్‌మి 15 ప్రో 5G, రియల్‌మి 15 5G భారత మార్కెట్లో (Realme 15 Pro 5G) లాంచ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పరంగా అద్భుతంగా ఉన్నాయి.

రియల్‌మి కొత్త AI-ఆధారిత ఫీచర్లు, కెమెరా సామర్థ్యాలు, పర్ఫార్మెన్స్ కారణగా ‘AI పార్టీ ఫోన్’గా మార్కెటింగ్ చేస్తోంది. కెమెరా, పర్ఫార్మెన్స్ సహా రియల్‌మి 15 సిరీస్ 5G భారీ 7000mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంది. మిడ్-రేంజ్ కేటగిరీలో ఫీచర్-ఫిల్డ్ స్మార్ట్‌ఫోన్‌ కొనేసుకోవచ్చు. రియల్‌మి 15, రియల్‌మి 15 ప్రో 5G ఫోన్ల వివరాలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Realme 15 Pro 5G : రియల్‌మి 15 ప్రో 5G, రియల్‌మి 15 5G ధర, లభ్యత, ఆఫర్లు :

రియల్‌మీ 15 ప్రో 5G ఫోన్ ఫ్లోయింగ్ సిల్వర్, వెల్వెట్ గ్రీన్, సిల్క్ పర్పుల్ కలర్ వేరియంట్లలో వస్తుంది. మొత్తం 4 స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. 8GB + 128GB ధర రూ. 31,999, 8GB + 256GB ధర రూ. 33,999, 12GB + 256GB ధర రూ. 35,999, 12GB + 512GB ధర రూ. 38,999కు లభ్యమవుతున్నాయి. మరోవైపు, రియల్‌మి 15 5G ఫోన్ ఫ్లోయింగ్ సిల్వర్, వెల్వెట్ గ్రీన్, సిల్క్ పింక్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Advertisement

Realme 15 Pro 5G : ధర, స్టోరేజీ ఆప్షన్లు :

8GB + 128GB ధర రూ. 25,999
8GB + 256GB ధర రూ. 27,999
12GB + 256GB ధర రూ. 30,999

రియల్‌మి 15 ప్రో 5G కొనుగోలుపై కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంకులపై రూ. 3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. రియల్‌మి రూ. 6వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, 12 నెలల వరకు నో కాస్ట్ EMI కూడా అందిస్తోంది. రియల్‌మి 15 5G కొనుగోలుపై ఎంపిక చేసిన బ్యాంకులపై రూ. 2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.

Read Also : Aadhar Card Loan : మీ ఆధార్ కార్డుతో రూ. 5000 ఇన్‌స్టంట్ లోన్ తీసుకోవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?

Advertisement

కొనుగోలుదారులు రూ. 5వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, 9 నెలల వరకు నో కాస్ట్ EMI కూడా పొందవచ్చు. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. ఈ సేల్ జూలై 30న Flipkart, Realme.com, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.

Realme 15 Pro 5G : రియల్‌మి 15 ప్రో 5G, రియల్‌మి 15 5G స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :

రియల్‌మి 15 ప్రో 5Gలో 6.8-అంగుళాల హైపర్‌గ్లో 4D కర్వ్+ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 6500nits వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌తో 12GB వరకు RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 50MP డ్యూయల్ కెమెరా సెటప్, 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 80W అల్ట్రా ఛార్జ్‌కు సపోర్టుతో భారీ 7000mAh బ్యాటరీ ఉంది. రియల్‌మి15 5Gలో 144Hz రిఫ్రెష్ రేట్, 6500nits వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల హైపర్‌గ్లో 4D కర్వ్+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300+ 5G చిప్‌సెట్ ద్వారా 12GB వరకు RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7000mAh బ్యాటరీతో వస్తుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel