Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో నిలబడాలంటే టాలెంట్ మాత్రమే కాదు.. అదృష్టం కూడా ఉండాలంటారు. ఏదైనా ఒక మూవీలో అవకాశం వస్తే.. సెలబ్రిటీ అయిపోవచ్చని చాలా మంది అనుకుంటారు.
సినిమా ప్రపంచం అనుకున్నంత ఈజీగా ఉండదు. కొంతమంది నటీనటుల జీవితాల్లో ఎన్నో బాధాకరమైనవి ఉంటాయి. అనేక మంది పెద్ద స్టార్స్ ఆమెతో కలిసి పనిచేయాలని ఆసక్త చూపేవారు. కానీ, విధి అనుకోని విధంగా ఆమె జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ ప్రముఖ నటి ఎవరు? ఆమె జీవితంలో బయటకు తెలియని వాస్తవాలేంటి? అలాంటి మహానటుల్లో సీనియర్ ప్రముఖ నటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
14ఏళ్లకే సినీ ప్రపంచంలోకి.. :
ఆమె మరెవరో కాదు ప్రముఖ హాస్యనటుడు కృష్ణమూర్తి, ఎంఎల్ వసంత కుమారి కుమార్తె శ్రీవిద్య. ఈమె పుట్టిన ఏడాదికే శ్రీవిద్య తండ్రి కృష్ణమూర్తి ప్రమాదం జరిగింది. దాంతో ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఆ
తరువాత, కుటుంబ బాధ్యత మొత్తం ఆమె తల్లి ఎంఎల్ వసంతపైనే పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శ్రీవిద్య 14 ఏళ్లకే సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నటుడు శివాజీ గణేశన్ సరసన ‘తిరువరుట్చెల్వన్’
మూవీతో శ్రీవిద్య తమిళ పరిశమ్రలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘పెట్టరాసి పెట్టమ్మ’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టింది. అద్భుతమైన నటన, నృత్యం, ఆకర్షణీయమైన అందంతో ఆమెకు చాలా
అవకాశాలు వచ్చాయి. దర్శకుడు దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో మరిన్ని సినిమాల్లో శ్రీవిద్య నటించి మెప్పించారు.
Senior Actress Srividya : కమల్ హాసన్‌తో ప్రేమాయణం :
రజనీకాంత్, కమల్ హాసన్‌లతో కలిసి బాలచందర్ మూవీ ‘అపూర్వ రాగంగల్’లో శ్రీవిద్య నటించారు. ఈ మూవీ భారీ విజయం సాధించి తెలుగులో కూడా రీమేక్ అయింది. రెండు భాషల్లోనూ శ్రీవిద్య కీలక పాత్ర
పోషించింది. అప్పట్లో శ్రీవిద్య, కమల్ హాసన్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. రీల్ లైఫ్‌తో పాటు, రియల్ లైఫ్‌లో కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ, శ్రీవిద్య తల్లి వారి పెళ్లికి అంగీకరించలేదు.
దర్శకుడు జార్జ్‌ను పెళ్లాడిన శ్రీవిద్య :
ఆ తర్వాత శ్రీవిద్య మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌తో పరిచయం ఏర్పడింది. నటి జార్జ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, ఆయన మత మార్పిడికి షరతు పెట్టాడు. కుటుంబం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది.
కానీ, శ్రీవిద్య అంగీకరించలేదు. ఆమె తన మతాన్ని మార్చుకుంది. 1978లో జార్జ్‌ని వివాహం చేసుకుంది. వివాహానంతరం భర్త కోరిక మేరకు సినీ కెరీర్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే, పెళ్లయ్యాక ఆవహ
జీవితంలో గందరగోళం నెలకొంది. జార్జ్ తన ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు. ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. శ్రీవిద్య 1980లో జార్జ్‌తో విడాకులు తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ సినిమాల్లోకి
రావాల్సి వచ్చింది.
సంపద మొత్తాన్ని పేద విద్యార్థులకు దానంగా :
తన ఆస్తిని తిరిగి ఇప్పించాలని హైకోర్టు వరకు పోరాడింది. ఆ తరువాత, శ్రీవిద్య రీఎంట్రీతో తన సినీ కెరీర్ ప్రారంభించింది. తమిళం, తెలుగు, మలయాళ చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్ చేసింది. కానీ, అదృష్టం ఆమెకు
అనుకూలంగా లేదు. 2003లో ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తన జీవితంలో చివరి రోజుల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తాను కూడబెట్టిన సంపదను సంగీత, నృత్య కళాశాలలోని
పేద విద్యార్థులకు సాయంగా అందించింది. నటుడు గణేష్ సాయంతో కూడా ఆమె ఒక ట్రస్ట్ స్థాపించారు. 2006లో 19న అక్టోబర్ శ్రీవిద్య మరణించారు.
Read Also : Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…
Tufan9 Telugu News providing All Categories of Content from all over world