Devatha serial Oct 4 Today Episode : రాధ మీద కోపంతో రగిలిపోతున్న సత్య.. ప్రకృతి వైద్యశాలకు వెళ్లిన రామ్మూర్తి కుటుంబం..?

Updated on: October 4, 2022

Devatha serial Oct 4 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో ఆదిత్య పై దేవుడు అమ్మ ఫైర్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ ఆదిత్య పై కోపడుతూ ఎప్పుడు ఆఫీసు పనులే కాదు ఆదిత్య భార్య గురించి కూడా ఆలోచించాలి తనకు ఆశలు ఉంటాయి కదా సత్యని బాధ పెట్టొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోతే ఎలా రా అని నిలదీస్తుంది దేవుడమ్మ. అప్పుడు ఆదిత్య నన్ను అర్థం చేసుకోండి నేను ఏం కావాలని బాధ పెట్టట్లేదు. సత్య ఇప్పుడు కుదరదు మనం తర్వాత ప్లాన్ చేద్దాం.

sathya-fires-on-radha-in-todays-devatha-serial-episode
sathya-fires-on-radha-in-todays-devatha-serial-episode

అప్పుడు ఆదిత్య నా వర్క్ ప్రెషర్ తగ్గగానే నేనే ప్లాన్ చేస్తాను అప్పుడు వెళ్దాం అని సత్య అని అంటాడు. అప్పుడు ఆదిత్య తనకు కుదరదు అని తెగేసి చెప్పడంతో సత్య ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు జానకి నిద్రపోతుండగా అప్పుడు మాధవ అక్కడికి వచ్చి నీకు దేవుడు మాటలు రాకుండా మంచిపని చేశాడు లేకపోతే నువ్వు నన్ను బతికించే దానివా అని అనుకుంటూ ఉంటాడు.

కన్న కొడుకుని నామీద లేని ప్రేమ రాధ మీద ఏంటమ్మా నా గురించి చెప్పాలనుకుని ఇలా అయిపోయావు నీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఆదిత్యకేంటి ఆదిత్యని ఏదో ఒకటి చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సత్య, దేవుడమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఆదిత్య అక్కడికి లగేజ్ తీసుకొని వస్తాడు.

Advertisement

దేవత సీరియల్ అక్టోబర్ 4 ఈరోజు ఎపిసోడ్ : రాధ మీద కోపంతో సత్య ఆవేశం..

అప్పుడు ఆ ఏంటి ఆదిత్య అని దేవుడమ్మ అడగగా చెప్పాను కదా మా క్యాంప్ ఉందని చాలా ఇంపార్టెంట్ అది ఫినిష్ చేసుకోవడానికి నాకు రెండు రోజులు టైం పడుతుంది అని అంటాడు ఆదిత్య. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆదిత్య రామ్మూర్తి ఇంటికి వెళ్లి సిద్ధంగా ఉన్నారా రామ్మూర్తి గారు అని అడగగా బయలుదేరడమే లేటు ఆఫీసర్ బాబు అని అంటాడు రామ్మూర్తి.

అప్పుడు ఆదిత్య జానకి దగ్గరికి వెళ్లి మీరు కంగారు పడకండి అది చాలా మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తారు త్వరగా కోలుకుంటారు అని అంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఆశ్రమానికి బయలుదేరుతారు. ఆ తర్వాత సత్య, రాధ మీద కోపంతో జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇక్కడికి వెళ్లారు అని అనుకుంటూ ఉంటుంది సత్య.

ఆ తర్వాత ప్రకృతి వైద్యశాలకు వెళ్తారు. అప్పుడు డాక్టర్ జానకి గురించి అడిగి కొద్ది రోజులు ఇక్కడే ఉంటే తెలుస్తుంది అనటంతో సరే అని అంటుంది రాదా. అప్పుడు జానకి మాధవ ఇక్కడ కూడా నాకు నయం అవ్వకుండా అడ్డుపడతాడా అని భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రాధ ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆదిత్య అక్కడికి వచ్చి ఏం కాదు జానకి గారికి నయమవుతుంది అనటంతో నేను దాని గురించి ఆలోచించడం లేదు నువ్వు నా వెంబడి వచ్చావని సత్యకు తెలిస్తే ఎంత బాధ పడుతుందో అని అంటుంది రాధ. దాంతో ఆదిత్య కూడా ఆలోచనలో పడతాడు.

Advertisement

Read Also : Devatha serial Oct 3 Today Episode : ప్రకృతి వైద్యశాలకు వెళ్ళాలి అనుకున్నా రామ్మూర్తి కుటుంబం.. సరికొత్త ప్లాన్ వేసిన మాధవ..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel